Wednesday, August 5, 2026 10:48 AM
Wednesday, August 5, 2026 10:48 AM

బాబుకి మొదటిసారి కలిసి వస్తున్న పొత్తు ఫలాలు

గతంలో టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా.. పొత్తుల ద్వారా వచ్చిన మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది. ఆ పొత్తులు ఎన్నికల సమయం నుంచి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా చంద్రబాబుని నానా ఇబ్బందులు పెట్టేవి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంత సమర్ధవంతంగా పని చేస్తున్నా.. పొత్తులో ఉన్న పార్టీల నాయకుల నుంచి వచ్చే సమస్యలు చాలా తీవ్రంగా ఉండేవి. కీలక సమయాల్లో వారు చంద్రబాబుకి చుక్కలు చూపించే వాళ్ళు. 2014 నుంచి 2019 వరకు కూడా బిజెపి నుంచి చంద్రబాబు ఇలాంటి సమస్యలు చాలానే ఎదుర్కొన్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

గత టిడిపి ప్రభుత్వంలో బిజెపి నాయకులూ సోమూ వీర్రాజు, జివిఎల్ నరసింహారావు లాంటి కొందరు నాయకులు నిత్యం చంద్రబాబు మీద, టిడిపి మీద విషం చిమ్ముతూనే ఉండేవారు. కానీ 2024 లో మాత్రం పరిస్థితి చాలా మారింది అని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు వైఖరితో పాటుగా పొత్తులో ఉన్న పార్టీల వైఖరిలో కూడా చాలా మార్పులు వచ్చాయి అనే మాట అక్షరాలా నిజం. రాజకీయంగా ఇది చంద్రబాబుకి నూతన ఉత్సాహాన్ని ఇచ్చే విషయమే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు మీద ఈగ కూడా వాలనీయడం లేదు అనే మాట వాస్తవం. చంద్రబాబు పని తీరుని టీడీపీ మంత్రుల కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా అర్ధం చేసుకోవడం, వాటిని ప్రజలకు వివరించడం చేస్తున్నారు.

విజయవాడ వరదల విషయం గాని, గతంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు గాని, తన పార్టీ ఎమ్మెల్యేలను కట్టడి చేసే విషయంలో గాని పవన్ కళ్యాణ్ నుంచి పూర్తి సహకారం ఉంటుంది చంద్రబాబుకి. చంద్రబాబు ఎలా పని చేస్తారు ఏంటీ అనే విషయాలను పవన్ కళ్యాణ్ పదే పదే వివరించడం కొసమెరుపు. బుధవారం కూడా ఆయన ఇలాంటి ప్రసంగమే చేసారు. గతంలో ఎన్నడు లేని విధంగా పొత్తు చంద్రబాబుకి కలిసి వస్తుంది. అటు బిజెపి సైతం చంద్రబాబుని ఇబ్బంది పెట్టడం లేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి చంద్రబాబుకి చాలా సహకరిస్తున్నారు. బిజెపి ఎమ్మెల్యేలు కూడా ఆమె మాట వింటున్నారు. ఇలా పొత్తు రాజకీయం మొదటిసారి చంద్రబాబుకి బలం అయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్