సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? వందల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మనందరినీ అలరించిన నటి ఆమె. అక్కగా, వదినగా, అమ్మగా ఎన్నో పాత్రల్లో జీవించేశారు. అయితే, గతంలో ఆమె సినిమాల్లో ఎక్కువగా కనిపించినా, ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకున్నారు. కానీ, ఆమె అభిమానులకు ఒక గుడ్ న్యూస్! సురేఖ కూతురు సుప్రిత హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
Also Read : ఏపీలో టాపిక్ డైవర్ట్ పాలిటిక్స్..!
సుప్రిత ఇప్పటికే మూడు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి ‘లేచింది మహిళా లోకం’. అంతేకాదు, బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్‌తో కలిసి మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్నాయి. వీటితో పాటు ‘అమరావతికి ఆహ్వానం’ అనే హారర్ థ్రిల్లర్ మూవీలో కూడా సుప్రిత హీరోయిన్‌గా కనిపించనుంది.
సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సురేఖా వాణి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. తన కూతురు సుప్రీతతో కలిసి డ్యాన్స్ రీల్స్ చేస్తూ తన ఫాలోవర్స్‌ని ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది సురేఖా వాణి. ఆ వీడియోలో ఆమె టాటూ వేయించుకుంటూ కనిపించింది. కూతురు సుప్రిత కూడా చప్పట్లు కొడుతూ తన తల్లిని ఎంకరేజ్ చేస్తోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. “ఆ పెదబాబు అడుగుల వెనకే ఉన్నాను” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
Also Read : బిగ్గెస్ట్ సైబర్ అటాక్.. మెయిల్ పాస్వార్డ్ చేంజ్ చేసుకోండి
సురేఖా వాణి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. “ఎవరా పెదబాబు?” అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఆ తర్వాత ఆమె తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదరక్షలను టాటూగా వేయించుకుందని తెలిసి అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. శ్రీవారిపై సురేఖకు ఉన్న భక్తిని చూసి మురిసిపోతున్నారు. నిజంగా సురేఖా వాణి భక్తికి ఇది నిదర్శనం కదూ!