Friday, November 27, 2026 08:12 PM
Friday, November 27, 2026 08:12 PM

మదురై దీపతూన్ వివాదంలో బిగ్ ట్విస్ట్.. విజయ్ కు సుప్రీం షాక్..!

తమిళనాడులోని మదురై తిరుపరంకుండ్రం కొండపై ఉన్న ‘దీపతూన్’ రాతి స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర స్థాయిలో మండిపడింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారని స్పష్టం చేస్తూ, ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వివాదంలో సంచలన ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు, రేపు కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్ పహారా నడుమ దీపతూన్ వద్ద దీపం వెలిగించాలని స్పష్టం చేసింది.

Also Read : కేంద్రం డీలిమిటేషన్ సాహసం.. నంబర్ల వెనుక అసలు రాజకీయం..?

కొండపై ఉన్న ఆలయం మరియు సమీపంలోని దర్గా వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతలు కాపాడాలని, రెండు చోట్లా మతపరమైన కార్యక్రమాలు సజావుగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా, కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైన తిరుపరంకుండ్రం ఆలయ ట్రస్ట్ బోర్డును సుప్రీంకోర్టు తక్షణమే సస్పెండ్ చేసింది. ఆలయ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు మేఘాలయ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని ఆలయ రిసీవర్‌గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

నవంబర్ 24న సుప్రీంకోర్టు అనుమతి ఉన్నప్పటికీ, కొండపై ఉన్న దీపతూన్ స్తంభం వద్ద కాకుండా కేవలం సంప్రదాయ ప్రదేశమైన ఉచ్చిపిళ్లయార్ మండపం వద్ద మాత్రమే దీపం వెలిగించడంపై పిటిషనర్లు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను నిర్వీర్యం చేయాలని చూస్తే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని, ఇలాంటి చర్యలను ఉక్కుపాదంతో అణచివేయాల్సిన సమయం ఆసన్నమైందని జస్టిస్ అరవింద్ కుమార్ హెచ్చరించారు. మదురై జిల్లా కలెక్టర్ సమర్పించిన నివేదికపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కోర్టు, అది కేవలం మొసలి కన్నీరు కార్చడం తప్ప మరొకటి కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది.

Also Read : ఎన్డీఏకు జగన్ అండ.. కానీ ఒక కండీషన్..!

కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా మెజిస్ట్రేట్‌గా కలెక్టర్‌దేనని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని, దీపం వివాదానికి సంబంధించి జరిగిన సమావేశాలు, సందేశాలు, కాల్ డేటా రికార్డులతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీఎస్‌తో పాటు రాష్ట్ర డీజీపీ, దేవాదాయ శాఖ కమిషనర్, మదురై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఎస్పీ మరియు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ముంబై బాస్‌ మళ్లీ...

ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు మరోసారి...

కేంద్రానికి షాక్ ఇచ్చిన...

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రంలోని ఎన్డీఏ...

తిరుమల భక్తులకు గుడ్...

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర...

ఎన్డీఏకు జగన్ అండ.....

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న...

గన్నవరంలో టీడీపీకి దిమ్మ...

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ రాజకీయం...

పవన్ మాస్టర్ స్ట్రోక్.....

గ్రామీణ రాజకీయాల్లో జనసేన తనదైన ముద్ర...

పోల్స్