Sunday, March 1, 2026 02:15 AM
Sunday, March 1, 2026 02:15 AM

ఢిల్లీలో స్వామిని యాక్టివేట్ చేసిన జగన్..?

ప్రాంతీయ పార్టీలు వారి వారి రాష్ట్రాల్లో ఎంత బలంగా ఉన్నా సరే.. ఢిల్లీ లెవెల్ లో ఆ పార్టీ కోసం లాబియింగ్ చేసే నాయకత్వం అనేది ఎంతో కీలకం. అందుకే దాదాపుగా ప్రాంతీయ పార్టీలు ఢిల్లీ పరిచయాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటాయి. జాతీయ పార్టీలతో పొత్తు వెనుక ఉద్దేశం కూడా ఇదే. అలా ఒకప్పుడు వైసీపీకి విజయసాయి రెడ్డి రూపంలో ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేసే నాయకత్వం బలంగా ఉండేది. అయితే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన తర్వాత ఆ లోటు కనపడింది.

Also Read : ఇంత జరుగుతున్నా.. ఆయనెక్కడా..?

ఆ పార్టీ అధినేత జగన్ ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందులు పడటానికి.. ఢిల్లీలో లాబియింగ్ చేసే నాయకత్వం లేకపోవడమే. అందుకే ఇప్పుడు జగన్ మళ్ళీ తన ఆలోచనలకు పదును పెట్టారు. విజయసాయి రెడ్డి ద్వారా వచ్చిన నాయకత్వాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్. బిజెపి మాజీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని.. అప్పట్లో జగన్ కు.. విజయసాయి దగ్గర చేసారు. ఇప్పుడు ఆయనే మళ్ళీ జగన్ కు దిక్కు అయ్యే అవకాశం ఉంది. తెలంగాణా మాజీ గవర్నర్ నరసింహన్ ద్వారా.. పరిచయం అయిన సుబ్రహ్మణ్య స్వామి.. ఇప్పుడు ఢిల్లీలో జగన్ ను కాపాడే బాధ్యతను తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి.

Also Read : అన్న వాకింగ్ అంటే.. మామూలుగా ఉండదు మరి..!

ఇటీవల.. కల్తీ లడ్డుపై వేసిన ఏక సభ్య కమీషన్ కు వ్యతిరేకంగా ఆయన సుప్రీం కోర్ట్ లో ఓ పిటీషన్ కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి రాజకీయ వర్గాల్లో.. సుబ్రహ్మణ్య స్వామిని జగన్ యాక్టివేట్ చేసారనే చర్చ మొదలైంది. సాయి రెడ్డి లేకపోయినా.. ఆ రూపంలో జగన్ కు అండగా ఉండేందుకు.. స్వామి ఢిల్లీలో పావులు కదిపే అవకాశం ఉంది. రాజకీయ వర్గాలతో పాటుగా.. లాయర్ కావడంతో న్యాయ వర్గాల్లో కూడా స్వామికి పట్టు ఎక్కువ. అందుకే ఇప్పుడు జగన్ ఆయనను నమ్ముకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్ : కాకినాడలో...

ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర ప్రమాదం...

కనిమొళికి, కవితకు జరిగిన...

ఆయేషా మీరా హత్య కేసు.. తెలుగు...

ఇంత జరుగుతున్నా.. ఆయనెక్కడా..?

ఇంత జరుగుతున్నా.. ఆయనెక్కడా..? ఇప్పుడు ఇదే...

బీఆర్ఎస్, బిజెపిలకు బులెట్...

గత నాలుగేళ్ల నుంచి సంచలనంగా మారిన...

అన్న వాకింగ్ అంటే.....

"మరో ఏడాదిన్నరలో నా పాదయాత్ర మొదలవుతుంది."...

పయ్యావుల వర్సెస్ మండలి...

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రాజకీయం హాట్...

పోల్స్