Sunday, March 1, 2026 04:00 AM
Sunday, March 1, 2026 04:00 AM

కమిషనర్‌పై వేటు.. ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం..!

శ్రీకాకుళం పట్టణంలో డయేరియా ప్రబలిన ఘటనకు బాధ్యుడ్ని చేస్తూ నగర పాలక సంస్థ కమిషనర్ హనుమంతు కూర్మారావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఆయనను సస్పెండ్ చేసినట్లుగా ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆయన స్థానంలో శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ బాధ్యతలను విశాఖపట్నం ఆర్‌డీఎంపీ రవీంద్రకు కట్టబెట్టినట్లుగా ఉత్తర్పులలో స్పష్టం చేసారు.

Also Read : ఆయనకే సీఎంఓలో కీలక బాధ్యతలు..!

అయితే డయేరియా ప్రబలడానికి మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ హనుమంతు కూర్మారావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి శ్రీకాకుళం నగర పాలక సంస్థ కమిషనర్‌గా సరిగ్గా 14 రోజుల క్రితమే అంటే ఫిబ్రవరి 11న హనుమంతు కూర్మారావు బాధ్యతలు స్వీకరించారు. విధులలో చేరిన నాటి నుంచి ఆయన నగర పాలక సంస్థ విభాగాల అధికారులు, సిబ్బందితో వరుస సమీక్షలు నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని పరిస్థితులను తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటనలు సాగించారు. ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచిస్తూ వస్తున్నారు. శ్రీకాకుళం నగరానికి పది రోజుల క్రితమే డెప్యుటేషన్ పై కమిషనర్‌గా వచ్చారు.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. కూర్మారావును స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు కూడా కమిషనర్‌గా సిఫార్సు చేసారు. ఇదే జిల్లాకు చెందిన వ్యక్తి అయిన కూర్మారావు కూడా వచ్చిన రోజు నుంచి అందరితో మంచిగానే ఉన్నారు. మనోడు శ్రీకాకుళం నగరానికి కమిషనర్‌గా వచ్చారని అంతా భావిస్తున్న తరుణంలో డయేరియా ప్రబలగా దానికి ఆయనను బాధ్యులను చేస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి కాఖ అధికారులు సస్పెండ్ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : కూటమి సర్కార్‌లో వైసీపీ ఐఏఎస్‌ల కుట్ర..!

నిజానికి డయేరియా ప్రబలడానికి అనేక కారణాలు ఉన్నాయి. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది. వీధుల్లో చెత్త పేరుకుపోయింది. కాలువలు మురుగుతో నిండిపోయాయి. డ్రైనేజ్ నుంచే కుళాయి పైపు లైన్లు వెళ్తున్నాయి. వీటికి తోడు చాలా చోట్ల రోడ్డు పనుల కోసం తవ్వేశారు. ఆ సమయంలో కుళాయి కనెక్షన్లు దెబ్బతిని కలుషిత నీరు ఆయా ప్రాంతాలకు సరఫర్తా అయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డయేరియా ప్రబలిన సమాచారం తెలిసిన వెంటనే కమిషనర్ కూర్మారావు సహాయక చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో కుళాయి నీటి సరఫరా నిలిపేసి.. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేశారు.

కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేసి ప్రత్యేక బృందాలను నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు కూడా. నిజానికి డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందని చాలా రోజులుగా ఫిర్యాదులున్నాయి. కాలువలు తీయడం లేదని, చెత్తను తరలించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజారోగ్య విభాగానికి హెడ్‌గా ఉన్న హెల్త్, ఆఫీసర్ డా.సుధీర్ పర్యవేక్షణ కొరవడడం వల్లనే ఈ పరిస్థితులు ఎదురయ్యాయనేది స్థానికుల ఆరోపణ. డా.సుధీర్ ఏరోజూ క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించిందే లేదని.. కార్పొరేషన్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. డయేరియా ప్రబలిన తర్వాత కూడా డా.సుదీర్ స్పందించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అలాగే రోడ్డు పనులు చేపట్టే సమయంలో కుళాయి కనెక్షన్లు దెబ్బతీసేలా ఇంజనీరింగ్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై కూడా స్థానికులు మండిపడుతున్నారు. అటు హెల్త్ ఆఫీసర్, ఇటు ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే డయేరియా ప్రబలినప్పటికీ.. పది రోజుల క్రితమే విధుల్లో చేరిన కమిషనర్‌ను సస్పెండ్ చేయడం ఏమిటని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్ : కాకినాడలో...

ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర ప్రమాదం...

కనిమొళికి, కవితకు జరిగిన...

ఆయేషా మీరా హత్య కేసు.. తెలుగు...

ఢిల్లీలో స్వామిని యాక్టివేట్...

ప్రాంతీయ పార్టీలు వారి వారి రాష్ట్రాల్లో...

ఇంత జరుగుతున్నా.. ఆయనెక్కడా..?

ఇంత జరుగుతున్నా.. ఆయనెక్కడా..? ఇప్పుడు ఇదే...

బీఆర్ఎస్, బిజెపిలకు బులెట్...

గత నాలుగేళ్ల నుంచి సంచలనంగా మారిన...

అన్న వాకింగ్ అంటే.....

"మరో ఏడాదిన్నరలో నా పాదయాత్ర మొదలవుతుంది."...

పోల్స్