Sunday, June 21, 2026 11:06 AM
Sunday, June 21, 2026 11:06 AM

బొత్సా కాళ్ళు నిజంగానే మంత్రి మొక్కారా..?

ఆంధ్రప్రదేశ్ లో వైసిపి తెలుగుదేశం పార్టీ మంత్రుల టార్గెట్ గా మైండ్ గేమ్ మొదలుపెట్టింది. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే మంత్రులపై సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి రెడీ అవుతుంది. ఇప్పుడు తాజాగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారు వైసిపి కార్యకర్తలు. వాటిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నమ్మి నిజమే అనుకుని సోషల్ మీడియాలో టార్గెట్ గా మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. అలాగే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కారంటూ ఒక ప్రచారం జరిగింది.

Also Read : గరికపాటికి రేవంత్ కీలక పదవి…!

దీనిపై తాజాగా టిడిపి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి క్లారిటీ ఇచ్చారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కాళ్లు మంత్రి మొక్కారు అనేది కేవలం అవాస్తవని… గత నెల 12వ తేదీన శాసనసభ సమావేశాలకు వస్తున్న సమయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో పాటు తాను కూడా విశాఖ విమానాశ్రయానికి వచ్చానని ఆ సమయంలో బొత్స సత్యనారాయణ ఎదురుపడ్డారని… దీంతో బోత్సాకు కొండపల్లి శ్రీనివాస్ నమస్కారం చేశారని ఆయనతో పాటు తాను కూడా నమస్కారం చేశానని వివరించారు.

Also Read : దీనెవ్వ తగ్గెదే లే.. తెలుగోడి సత్తా..!

రాజకీయాల్లో శత్రువు ఎదురైనా చేతులెత్తి నమస్కారం చేయడం సంస్కారం అని, అలాంటి పనే మేము కూడా చేశామని క్లారిటీ ఇచ్చారు. కానీ వాస్తవాలు తెలియకుండా సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తూ లేనిపోని రాతలు రాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే ప్రతిపక్ష నేతలు ఇలాంటి రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. అయితే మంత్రిపై తాజాగా సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి ఇప్పుడు మాజీ మంత్రి వారు ఇచ్చిన వివరణతో తెలుగు తమ్ముళ్ళు శాంతిస్తారా లేదా అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్