చాలామంది సన్ స్క్రీన్ ను కేవలం బయటకు వెళ్ళినప్పుడు లేదా బీచ్ కి వెళ్ళినప్పుడు మాత్రమే వాడే ప్రయత్నం చేసారు. అయితే దీనిపై నిపుణులు పలు వార్నింగ్ లు ఇస్తున్నారు. వాస్తవానికి చర్మ నష్టం అనేది మన ఇంటి గుమ్మం దాటాక మాత్రమే మొదలుకాదని.. మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా సూర్యరశ్మి ప్రభావం మన చర్మంపై ఉంటుందట. కిటికీల గుండా వచ్చే కాంతిలో ఉండే యూవీఏ కిరణాలు చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : నాయుడుపై వేటు.. కొత్తగా సీనియర్ నేత..!
ఇవి సాధారణ అద్దాల గుండా కూడా ప్రయాణించగలవు.. కాబట్టి మీరు కిటికీ పక్కన కూర్చున్నా లేదా ఇంట్లో వెలుతురు ఉన్న చోట ఉన్నా మీ చర్మం ప్రమాదానికి గురవుతున్నట్లే లెక్క అని హెచ్చరిస్తున్నారు. ఇండోర్ యూవీ కిరణాలు కేవలం సౌందర్య పరమైన ఇబ్బందులనే కాకుండా, చర్మం యొక్క అంతర్గత నిర్మాణాన్ని దెబ్బతీస్తాయట. ఇంట్లో సన్ స్క్రీన్ వాడకపోవడం కారణంగా.. కలిగే ప్రధాన నష్టం ఏంటంటే, ఇది చర్మంలో ఫ్రీ రాడికల్స్ ను విపరీతంగా ప్రేరేపిస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ చర్మ కణాలను ఆక్సీకరణ ఒత్తిడికి గురిచేసి, చర్మానికి ఉండే సహజ రక్షణ పొరను బలహీనపరుస్తాయి.
Also Read : అమరావతిలో కేటుగాళ్ళు.. స్పెషల్ ఫోకస్ పెట్టిన ఎస్పీ..!
దీనివల్ల చర్మం తన తేమను కోల్పోయి, త్వరగా ముడతలు పడటం, కాంతిహీనంగా మారడం వంటి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా, ఈ కిరణాల ప్రభావం వల్ల చర్మంపై మంట, ఎర్రబడటం వంటి ఇబ్బందులు కలగడమే కాకుండా, చర్మం యొక్క స్థితిస్థాపకతను దెబ్బతీసి చర్మాన్ని వేలాడేలా చేస్తాయి. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఇండోర్ ఎక్స్పోజర్ వల్ల మెలస్మా, మెలనోమా వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. మెలస్మా వల్ల ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడి చర్మం రంగు మారుతుంది. ఇది ఒకసారి వస్తే తగ్గించడం చాలా కష్టం. ఇక మెలనోమా అనేది అత్యంత ప్రమాదకరమైన చర్మ క్యాన్సర్లలో ఒకటి. కిటికీల ద్వారా వచ్చే కాంతిని తక్కువ అంచనా వేయడం వల్ల చర్మ కణాలు నిరంతరం దెబ్బతింటూ, భవిష్యత్తులో క్యాన్సర్ కారకాలుగా మారే అవకాశం ఉంది.

