Wednesday, May 6, 2026 11:46 PM
Wednesday, May 6, 2026 11:46 PM

జగన్‌కు బైబై చెప్పనున్న మరో సీనియర్ నేత..!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు వైసీపీ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. నిన్నటి వరకు ఆహా.. ఓహో.. అంటూ పొగిడిన నేతలే… జగన్‌ నిర్ణయాలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. అసెంబ్లీకి గైర్హాజరు విషయం మొదలు… నియోజకవర్గాలకు పార్టీ ఇంఛార్జుల మార్పు వరకు జగన్ తీసుకున్న అన్ని నిర్ణయాలను సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక కొంతమంది నేతలైతే… జగన్‌తో ఉంటే… రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే అనే భయంతో వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇదే జాబితాలో మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం కూడా చేరిపోతున్నారు.

1983లో తొలిసారి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు తమ్మినేని సీతారాం. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 18 శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. శాసనసభపతిగా వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఉన్నారు. తెలుగుదేశం, ప్రజారాజ్యం, వైసీపీలో సీనియర్ నేతగా గుర్తింపు. అయితే వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే స్పీకర్ స్థానంలో ఉండి రాజధాని అమరావతి ప్రాంతాన్ని స్మశానంతో పోల్చారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే.. ఏ మాత్రం అడ్డుచెప్పలేదు కూడా.

Also Read: జగన్ కు టిట్ ఫర్ టాట్… బాబు వ్యూహం భేష్

స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి… రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. కానీ తమ్మినేని సీతారాం మాత్రం ఐదేళ్లు వైసీపీకి అనుకూలంగా టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరారు తమ్మినేని. కానీ జగన్ మాత్రం ఈసారికి మీరే… తర్వాత మీ అబ్బాయికి అని హామీ ఇచ్చాడు. దీంతో సరే చెప్పేసిన 2024 ఎన్నికల్లో పోటీ చేసి.. సొంత మేనల్లుడి చేతిలోనే ఓడిపోయారు. అయితే 2029లో తన కుమారుడికి అవకాశం వస్తుందని గంపెండంత ఆశతో ఉన్న తమ్మినేనికి జగన్ గట్టి ఝలక్ ఇచ్చాడు.

Also Read: పుష్ప ప్రమోషన్స్ కి అతిధులుగా ఆ ముగ్గురు..!

నియోజకవర్గం ఇంచార్జిగా చింతాడ రవికుమార్ పేరు ప్రకటించారు. దీంతో తమ్మినేని వర్గం అగ్గి మీద గుగ్గిలం మాదిరిగా ఫైర్ అవుతోంది. పదేళ్లుగా పార్టీలో కొనసాగుతున్న నేతలను కనీసం సంప్రదించకుండా ఇంఛార్జ్‌ను ఎలా ప్రకటిస్తారంటూ నియోజకవర్గం వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే విషయంపై తమ్మినేని కూడా తన అనుచరులతో సమావేశమయ్యారు. ఎన్నికల నాటికి తన కుమారుడు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి… ఏ పార్టీ అయితే బెటర్ అనే కోణంలో సంప్రదింపులు జరిపారు.

 

కొంతమంది జిల్లాకు చెందిన వైసీపీ నేతల కారణంగానే తమను జగన్ పక్కన పెట్టాడని… కాబట్టి వైసీపీలో కొనసాగడం కష్టమే అనే కోణంలో కూడా చర్చించారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై తమ్మినేని ప్రకటన చేస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు. తమ్మినేని పార్టీ మారితే మాత్రం… శ్రీకాకుళం జిల్లాలో ఓ వర్గం నేతలు వైసీపీకి దూరమైనట్లే అనేది విశ్లేషకుల మాట.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్