Sunday, June 21, 2026 02:48 AM
Sunday, June 21, 2026 02:48 AM

గంభీర్ వింత నిర్ణయాలు.. షాక్ లో మాజీలు

గౌతమ్ గంభీర్.. అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువగా వినపడుతున్న పేరు. ఆటగాడిగా ఉన్నప్పటి కంటే కోచ్ గానే గంభీర్ ఎక్కువ ఫేమస్ అవుతున్నాడు. 2011 ప్రపంచ కప్ గెలవడంలో అత్యంత కీలకపాత్ర పోషించిన గంభీర్, భారత జట్టుకు టి20 ప్రపంచ కప్ రావడంలో కూడా కీలకపాత్ర పోషించాడు. టెస్ట్ జట్టులో కూడా కీలక ఆటగాడిగా ఎన్నో విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు. ఇక ద్రావిడ్ తర్వాత కోచ్ బాధ్యతలు చేపట్టిన గంభీర్.. జట్టులో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాడు.

Also Read : అలాంటి వారితోనే ఇబ్బందులు.. బాబు నైరాశ్యం..!

టెస్ట్ జట్టు నుంచి రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లను తప్పించడంలో సక్సెస్ అయ్యాడు అనే అభిప్రాయం సైతం ప్రచారంలో ఉంది. ఆ తర్వాత టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా గిల్ ఎంపిక కావడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో గాని, ఆ తర్వాత జరిగిన చాంపియన్స్ ట్రోఫీ, జూన్ లో జరిగిన ఇంగ్లాండ్ పర్యటన, ఆసియా కప్, ఇప్పుడు జరుగుతున్న ఆస్ట్రేలియా పర్యటనలో జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలున్నాయి. ముఖ్యంగా సమర్థవంతమైన ఆటగాళ్లను పక్కనపెట్టి.. తనకు నచ్చిన వారిని సెలెక్ట్ చేస్తున్నాడు అనే విమర్శలు ఉన్నాయి.

Also Read : అన్నాడిఎంకేకు శశికళ వెన్నుపోటు..? రంగంలోకి మన్నార్ గుడి మాఫియా..?

అజిత్ అగార్కర్ కూడా గంభీర్ కు సహకరించడం విమర్శలకు దారితీస్తోంది. ఇదే సమయంలో ప్లేయింగ్ లెవెన్ విషయంలో కూడా అతను పక్షపాతం చూపిస్తున్నాడు అనే విమర్శలు వస్తున్నాయి. రెండవ టి 20 లో అర్షదీప్ సింగ్ ను పక్కన పెట్టడం పై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అతని స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేసాడు. భారత్ తరపున టి20 లలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా ఉన్న అర్షదీప్ సింగ్ ను కాదని రానాని ఎంపిక చేయటంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. మూడవ పేస్ బౌలర్ లేకుండా బరిలోకి దిగడంపై కూడా విమర్శలు వచ్చాయి. ఆస్ట్రేలియాలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాకుండా.. అక్షర్ పటేల్ ను ఇంటికి చేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై మాజీ ఆటగాళ్లు ఆశ్చర్యo వ్యక్తం చేస్తున్నారు. అసలు గంభీర్ ప్లాన్ ఏంటో అర్థం కావటం లేదని.. అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్