Thursday, May 7, 2026 09:33 AM
Thursday, May 7, 2026 09:33 AM

రేవంత్‌ను ఎదుర్కోవాలంటే కేసీఆర్‌కు బీజేపీనే ఆయుధమా…?

తెలంగాణలో మళ్లీ భారత రాష్ట్ర సమితి.. కేంద్రంలో అధికారంలో ను బిజెపికి దగ్గరవుతుందా అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం అవుతున్నాయి. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో గులాబీ పార్టీని కాపాడుతుంది కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేపదే హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీ వెళుతున్నారని, కేంద్ర పెద్దలతో లాలూచీ పడుతున్నారని.. ఈ విషయం తనకు తెలుసని ఆయన కామెంట్స్ చేసారు.

Also Read : వంశీపై ఎందుకింత ప్రేమ..?

కొంతమంది కేంద్ర మంత్రులు, ఎంపీలు తనతో సన్నిహితంగా ఉంటారని వాళ్లు అదే విషయాన్ని తనతో చెప్పారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనితో ఒక్కసారిగా తెలంగాణ.. బిజెపితో పాటుగా గులాబీ పార్టీలో కూడా కలవరం మొదలైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ కు బిజెపి అవసరం చాలా ఎక్కువ. మాజీ గవర్నర్ నరసింహన్ ఈ విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. బిజేపి దగ్గరగా లేదంటే తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి గులాబీ పార్టీ చాలా కష్టపడాల్సి ఉంటుంది.

Also Read : జగన్‌కు అసెంబ్లీ ఝలక్..!

రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం అంత సులువు కాదు అనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చేసారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం మద్దతు కావాల్సిందే అనే ధీమాలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. ముందు బిజెపి విషయంలో దూకుడుగా విమర్శలు చేసిన గులాబీ పార్టీ నాయకులు.. ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. మూసి నది ప్రక్షాళన విషయంలో బిజెపి నుంచి గులాబీ పార్టీకి పరోక్ష మద్దతు ఉంది అని అభిప్రాయాలు కూడా వినిపించారు. అలాగే హైడ్రా విషయంలో కూడా ముందు సపోర్ట్ చేసిన బీజేపీ.. తర్వాత సైలెంట్ అయిపోయింది.

Also Read : తెలుగోళ్ళ తమిళ పిచ్చి.. ఆ డైరెక్టర్ల వెంట పడుతున్నారా…?

కేటీఆర్ దాదాపుగా అరెస్ట్ అవుతారు అనే వార్తలు వచ్చినప్పటి నుంచి అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఆయన అరెస్టును ఎవరో అడ్డుకుంటున్నారు అనే ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. ఇక తెలంగాణ పోలీసులు ఫోన్ టాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న శ్రవణ్ రావును, ప్రభాకర్ రావును రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు నానా కష్టాలు పడుతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉండటం లేదు. దీనితో ఫోన్ టాపింగ్ విషయంలో గులాబీ పార్టీని బిజెపి కాపాడుతుందనే అభిప్రాయాలు గతంలోనే వినిపించాయి. వాటికి ఉతం చేకూర్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్