Thursday, May 7, 2026 02:43 AM
Thursday, May 7, 2026 02:43 AM

సిరాజ్ బ్యాక్ స్టెప్ వద్దు.. రవిశాస్త్రి సలహా

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మహ్మద్ సిరాజ్ తన దూకుడు వైఖరిని కొనసాగించాలని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియన్ పబ్లికేషన్ కోడ్‌లోని తన కాలమ్‌లో, శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. కొంచెం కూడా వెనకడుగు వేయవద్దని సూచించారు. తాను కోచ్ గా ఉన్న సమయంలో ఏ భారత ఆటగాడు ఆస్ట్రేలియా విషయంలో వెనకడుగు వేయలేదని… కాబట్టి తాను ఇప్పుడు కూడా జట్టు నుంచి అదే దూకుడు కోరుకుంటున్నా అని రవి శాస్త్రి స్పష్టం చేసాడు. ఇక రెండో టెస్ట్ వివాదంపై స్పందించాడు.

Also Read : మా నాన్న.. మా నాన్న కాదు.. మనోజ్ సంచలన ప్రెస్ మీట్

సిరాజ్, హెడ్ ఇద్దరూ మెచ్యూరిటీ ఉన్న ఆటగాళ్ళని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇదే కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. గతంలో తాను కోచ్ గా ఉన్న సమయంలో టీం ఇండియా… ఆస్ట్రేలియా పర్యటనకు వస్తే… నా ఆటగాళ్లకు ఇదే చెప్పాను… ఒక్క అడుగు వెనకడుగు వద్దని ఆస్ట్రేలియాకు దీటుగా సమాధానం చెప్పాలని చెప్పేవాడిని అన్నాడు. విరాట్ కోహ్లీ నుండి రిషబ్ పంత్ వరకు మరియు జట్టులోని ప్రతి సభ్యుడు దూకుడు వైఖరిని ఆసీస్‌కు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు.

Also Read : మీవల్లే ఇదంతా.. ఎస్పీలు, డీఎస్పీలపై చంద్రబాబు ఫైర్

పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో సిరాజ్, హెడ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రెండవ రోజు ఆటలో హెడ్ సెంచరీ చేయగా… ఆ తర్వాత మంచి యార్కర్ తో సిరాజ్ హెడ్ ను అవుట్ చేసాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. దానికి హెడ్ స్పందిస్తూ తాను సిరాజ్ తో… బాగా బౌలింగ్ చేసావని చెప్పినట్టు హెడ్ చెప్పుకొచ్చాడు. కాని అది అబద్దం అంటూ సిరాజ్ కొట్టిపారేశాడు. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మహ్మద్ సిరాజ్ మరియు ట్రావిస్ హెడ్ ఇద్దరికీ ఒక డీమెరిట్ పాయింట్‌ను యాడ్ చేసింది ఐసీసీ. సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. హెడ్ జరిమానా నుండి తప్పించుకున్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్