Wednesday, February 25, 2026 03:57 AM
Wednesday, February 25, 2026 03:57 AM

పూల్ వాలీబాల్.. రష్మిక – విజయ్ పెళ్లి ఓ రేంజ్ లో..!

స్టార్ జంట రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ పెళ్లి వేడుకలు స్టార్ట్ అయ్యాయి. నేడు మెహందీ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక నేటి ఉదయం నుంచే పెళ్లి వేడుకలకు సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ప్రీ-వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు ఒకసారి చూస్తే, సూర్యోదయం సమయంలో.. ఫ్రెండ్స్ తో కలిసి పూల్ పార్టీ చేసుకున్నారు. అలాగే క్యాండిల్ లైట్ డిన్నర్ సహా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది ఈ జంట.

Also Read : భారత్ సెమీస్ చేరాలంటే.. ఇది జరగాల్సిందే..!

రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో గోల్డెన్ లైట్ తో ఉన్న టేబుల్ ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఆ డెకరేషన్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. బ్లష్ పింక్ లిల్లీస్, గ్రీన్ హైడ్రేంజాలతో ఓ బోకే మాదిరిగా చేసిన డిజైన్ ఆకట్టుకుంది. కనపడి కనపడనట్టు ఓ ఇన్విటేషన్ కార్డ్ కూడా అక్కడ పోస్ట్ చేసారు. ఇక విజయ్ దేవరకొండ తన ఫ్రెండ్స్ తో కలిసి పూల్ వాలీబాల్ మ్యాచ్ ఆడాడు. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. క్లియర్ గా కనపడకుండా.. సబ్జెక్ట్ మాత్రం అర్ధమయ్యేలా ఈ ఫోటో ఉంది.

Also Read : మరో వివాదంలో మోహన్ బాబు యూనివర్సిటీ..!

అలాగే పూల్ లో ఫ్లోటింగ్ డ్రింక్స్ కూడా ఏర్పాటు చేసారు. ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంచితే.. ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగనుంది. దాదాపు ఏడేళ్ళ నుంచి ప్రేమలో ఉంది ఈ జంట. ఫిబ్రవరి 24న మెహందీ వేడుకలు, ఆ తర్వాత ఫిబ్రవరి 25న ఉదయపూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో హల్దీ, సంగీత్ వేడుకలు ఉంటాయి. ఇప్పటికే అతిధులు వీళ్ళ పెళ్లి కోసం ఉదయ్ పూర్ చేరుకున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జగన్ ను తిట్టోద్దని...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కల్తీ లడ్డు వ్యవహారంపై...

అందరి జాతకాలు బయటపెడతా..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్...

ప్లాన్ ప్రకారమే అంతా.....

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

తిరుమల పవిత్రతకు ప్రత్యేక...

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిరక్షణపై...

మరో వివాదంలో మోహన్...

గత రెండు మూడేళ్ళ నుంచి సినీ...

ఆఫ్ ది రికార్డు...

గుంటూరు మిర్చి యార్డు అంటే ఉమ్మడి...

పోల్స్