Tuesday, February 17, 2026 05:54 AM
Tuesday, February 17, 2026 05:54 AM

టీడీపీ మహిళా ఎమ్మెల్యే స్పీడ్.. ఫిదా అయిపోయిన క్యాడర్

సాధారణంగా తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అనేది కొంత ఎక్కువగానే ఉంటుంది. కాలానికి అనుగుణంగా నాయకులు మారాల్సిన సమయంలో కూడా.. క్రమశిక్షణ పేరుతో కాళ్లకు బంధం వేస్తూ ఉంటుంది అధిష్టానం. వైసిపి నాయకులు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా సరే.. టిడిపి నాయకులు మాత్రం కంట్రోల్ గా మాట్లాడుతూ ఉంటారు. ఇది కొంతవరకు కరెక్టే అయినప్పటికీ కొంత మాత్రం ఇబ్బందికరంగానే ఉంటుంది. సాధారణంగా తెలంగాణ రాజకీయాల్లో చూస్తే.. మాటకు మాట అన్నట్లుగా రాజకీయం నడుస్తూ ఉంటుంది. అలా ఏపీలో కూడా నడవాలి అనేది చాలామంది టీడీపీ కార్యకర్తలు మనోగతం.

Also Read : కార్యకర్తలకు లెటర్లు ఇవ్వరా..? ఎమ్మెల్యేలపై ఆగ్రహం..!

ఇప్పుడు ఈ విషయంలో కొంతమంది టిడిపి ఎమ్మెల్యేలు కార్యకర్తల కోరికను నెరవేరుస్తున్నారు అనే వ్యాఖ్యలైతే వినపడుతున్నాయి. తాజాగా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి.. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుకు ఇచ్చిన కౌంటర్ ఆశ్చర్యపరిచింది. ఇటీవల కాలంలో అనంతబాబు నియోజకవర్గంలో దూకుడు పెంచి ఆమెను బెదిరిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. దీనిపై అనంతబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చారు. తాను కనుసైగ చేస్తే ఎమ్మెల్యే ఉండదు అంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమెను పిచ్చిదానా అంటూ కొంత అవమానకరంగా మాట్లాడారు అనంతబాబు.

Also Read : గిల్ కు మరో షాక్ ఇవ్వనున్న సెలెక్టర్ లు..!

దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శిరీష.. ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ అనంత బాబు కొంగుచాటునుండి రాజకీయాలు చేస్తున్నారని.. తనను విమర్శించే ముందు వెనకా ముందు చూసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు. అలాగే తనను పిచ్చిదానా అన్న మాటకు.. పిచ్చి నాకొ… అంటూ అదే స్థాయిలో సమాధానం చెప్పారు శిరీష. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడటం తో టిడిపి కార్యకర్తలు ఫిదా అయిపోయారు. వాస్తవానికి రంపచోడవరం నియోజకవర్గంలో అనంతబాబు పెత్తనం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది అనే కామెంట్స్ వినిపించాయి. అయితే శిరీష దేవి వచ్చిన తర్వాత కొంత నియోజకవర్గంలో మార్పు కనపడింది అనే మాట కూడా వినపడింది. అధికారులు ముందు మాట వినకపోయినప్పటికీ ఆ తర్వాత ఎమ్మెల్యే మాట చెల్లుతోంది అనే అభిప్రాయాలు సైతం నియోజకవర్గంలో ఉన్నాయి. ధైర్యంగా ఆమె నియోజకవర్గంలో తిరగటం.. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకం కావడంతో అనంతబాబు కొంత ఆత్మ రక్షణలో పడ్డారు. అలాగే అనంతబాబు చరిత్రను ప్రజల్లో వివరించడంలో కూడా ఆమె సక్సెస్ అయ్యారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బెజవాడ మేయర్ గా...

రాజకీయాల్లోకి ఎప్పుడు, ఎవరు, ఏ రూపంలో...

జగన్ ఢిల్లీ ప్రయత్నాలు...

2019 లో వైఎస్ జగన్ సిఎం...

బ్రేకింగ్: టాలీవుడ్ లో...

టాలీవుడ్‌లో ప్రముఖ నటులు రష్మిక మందన్న...

అర్ధరాత్రి కొలంబోలో.. ఉదయం...

సాధారణంగా రాజకీయ నాయకులు.. ముఖ్యంగా అధికారంలో...

ఏడ్చేసిన పాక్ ఆటగాళ్ళు.....

వేదిక ఏదైనా.. భారత్ వర్సెస్ పాకిస్తాన్...

ముగిసిన రాజకీయ ప్రస్థానం.....

కొంతమందికి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. అలాంటి...

పోల్స్