Wednesday, August 5, 2026 12:56 PM
Wednesday, August 5, 2026 12:56 PM

వర్మకు పోలీసుల ప్రశ్నలు.. చెవిరెడ్డి సమాధానాలు..!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చెలరేగిపోయిన వారిలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఆయన వైసీపీ పెద్దల అండ చూసుకుని అప్పట్లో చెలరేగిపోయారు. సినిమాలు, సోషల్ మీడియా పోస్ట్ లతో ఆయన అప్పట్లో టీడీపీ పెద్దలను, జనసేన అధినేతపై విమర్శలు చేసారు. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై చర్యలు ఉండే అవకాశం ఉందని చాలా మంది భావించారు. కాని ఇప్పటి వరకు ఆయనను అరెస్ట్ చేయలేదు. చాలా ధైర్యంగా వర్మ తిరుగుతున్నారు.

Also Read: ఢిల్లీ వెళ్ళండి సామి.. ఎంపీలకు జగన్ రిక్వెస్ట్

ఇక వర్మ తాజాగా విచారణకు హాజరు అయ్యారు. కోర్ట్ ఆదేశాలతో వర్మ విచారణ కొరకు ఒంగోలు వెళ్ళారు. సినీ దర్శకుడు ఆర్జీవీని ఒంగోలు రూరల్‌ పియస్‌లో రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు విచారించారు. 2024 నవంబర్‌ 10వ తేదిన మద్దిపాడు పియస్‌లో టిడీపీ నేత ఫిర్యాదుతో వర్మపై కేసు నమోదు అయింది. వ్యూహం సినిమా ప్రమోషన్‌ కోసం చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ ఫోటోలను మార్ఫింగ్‌ చేసి ఎక్స్‌ లో వర్మ పోస్ట్ లు చేసినట్టు ఫిర్యాదులు వెళ్ళాయి. గతంలో విచారణకు రాకుండా హైకోర్టు ద్వారా అరెస్ట్‌ నుంచి వర్మ తప్పించుకున్నారు.

Also Read: ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు జగన్..?

అరెస్ట్‌ లేకపోయినా విచారణకు హాజరుకావాల్సిందేనన్న కోర్టు ఆదేశాలతో నేడు ఆయనకు విచారణ కోసం ఒంగోలు వెళ్ళారు. తాజాగా ఈనెల 7న విచారణకు రావాలని వాట్సప్‌ ద్వారా పోలీసులు నోటీసులు పంపారు. ఈరోజు విచారణకు వస్తానని వర్మ సమాచారం ఇచ్చారు. ఇక వర్మను ప్రశ్నించేందుకు ప్రశ్నావళిని తయారు చేసుకున్నారు ఒంగోలు రూరల్‌ సిఐ శ్రీకాంత్‌బాబు. హైదరాబాదు నుంచి రోడ్డు మార్గంలో ఒంగోలుకు వెళ్ళారు. ఆర్జీవిని ఒంగోలు శివారులో హైవేపై రిసీవ్ చేసుకుని కొద్దిసేపు వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడటం గమనార్హం. ఆయన ఏ సమాధానాలు చెప్పాలో వైసీపీ నేతలే వర్మకు హింట్ ఇచ్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్