Thursday, May 7, 2026 03:25 AM
Thursday, May 7, 2026 03:25 AM

సాయి రెడ్డే కీలకమా..? కసిరెడ్డి రిమాండ్ లో సంచలనాలు..!

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణలో వెల్లడించిన విషయాలపై ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది. రాజకీయంగా లిక్కర్ కుంభకోణం వైసీపీని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే సంకేతాలు కనబడుతున్నాయి. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రిమాండ్.. రిపోర్ట్ లో పేర్కొన్న అంశాల విషయంలో వైసీపీలో ఆందోళన మొదలైంది. తాజాగా లిక్కర్ కుంభకోణం లో ఉన్న నిందితులకు సంబంధించి దర్యాప్తు అధికారులు లిస్ట్ రిలీజ్ చేశారు.

Also Read : కసిరెడ్డి కేసు: ఏసీబీ కోర్ట్ లో యుద్ద వాతావరణం

ఇందులో విజయసాయిరెడ్డి తో పాటుగా రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి పేర్లు కూడా ప్రస్తావించారు. అయితే విజయసాయిరెడ్డిని విచారించినప్పుడు దర్యాప్తు అధికారులు ఎక్కువగా సజ్జల శ్రీధర్ రెడ్డి పేరుతో పాటుగాపలు కంపెనీల పేర్లను అదేవిధంగా.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్లను వాంగ్మూలంలో నమోదు చేసినట్లు తెలుస్తోంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పరిచయాల కారణంగానే లిక్కర్ కుంభకోణంలో విజయసాయిరెడ్డి కూడా ఇరుక్కున్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

Also Read : వీరయ్య చౌదరి మరణం వెనుక అతడే..?

స్వతహాగా తనకు ఏ ప్రయోజనం లేకుండా విజయసాయిరెడ్డి ఏ వ్యవహారంలో కూడా తల దూర్చే ప్రయత్నం చేయరు. కానీ లిక్కర్ కుంభకోణంలో బహుమతులు ఇచ్చే దగ్గరనుంచి.. ప్రతి విషయంలో కూడా విజయసాయిరెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఆయన నివాసంలోనే పలు ఒప్పందాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. కాకినాడ నుంచి ఆయన నివాసానికి వెళ్లిన పలు.. పత్రాలపై దర్యాప్తు అధికారులు కీలక ఆధారాలను పరిశీలించి ఆయనను రిమాండ్ రిపోర్ట్ తో పాటుగా నిందితుల జాబితాలో కూడా చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. కాకినాడ సి పోర్టు వ్యవహారంలో విజయసాయిరెడ్డి పాత్ర అత్యంత కీలకం. ఆ వ్యవహారంలోనే మద్యం కుంభకోణం కూడా ఉన్నట్లుగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్