Wednesday, August 5, 2026 06:42 AM
Wednesday, August 5, 2026 06:42 AM

హీరోకు 300 కోట్లు.. అభిమానుల జేబులకు మాత్రం చిల్లు

మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న పుష్ప టు సినిమా టికెట్ ధరల విషయంలో సినిమా మేకర్స్ తీసుకున్న నిర్ణయం పై ఇప్పుడు తీవ్రస్థాయి విమర్శలు వస్తున్నాయి. దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలపడంతో భారీగా టికెట్ ధరలను పెంచేశారు. దీనితో అల్లు అర్జున్ అభిమానులు కూడా టికెట్ ధరలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. బెనిఫిట్ షో ధరలు భారీగా ఉండటంతో మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమా చూడటం కష్టమని అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు వెళ్లాలి అనుకుంటే తడిచి మోపెడు కావడం ఖాయం అని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Also Read : రాజకీయ శరణార్థిగా గుర్తించండి.. ప్రభాకర్ రావు సంచలన ట్విస్ట్

ఈ నేపద్యంలో ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల పెంపుపై కూడా పుష్ప సినిమా మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సినీ నిర్మాత అల్లు అరవింద్ కలిసి ఈ అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే పుష్ప సినిమా మేకర్స్ కూడా అమరావతి వచ్చి పవన్ కళ్యాణ్ తో భేటీ కావడానికి సిద్ధమవుతున్నారు. దీనితో తెలంగాణతో పాటుగా ఏపీలో కూడా ధరలు భారీగా పెరిగే అవకాశం కనబడుతోంది. ఇదే జరిగితే మాత్రం తొలి నాలుగు రోజులు సినిమాకు వసూళ్లు పడిపోయే అవకాశం ఉంది అని కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.

మిడిల్ క్లాస్ అలాగే మాస్ ఆడియన్స్ సినిమా చూడాలి అంటే ధరలు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 250 రెట్లు సినిమా టికెట్ ధరలను పెంచడం పట్ల ఇప్పుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మల్టీప్లెక్స్ లో 550లో టికెట్ ధర ఉండటం పట్ల అల్లు అర్జున్ అభిమానులే ఆగ్రహంగా ఉన్నారు. ఇక బెనిఫిట్ షోల పేరుతో నాలుగో తారీఖు సాయంత్రం నుంచే సినిమా ప్రదర్శన మొదలుకానుంది. వీటికి కూడా భారీగా అభిమానుల నుంచి వసూలు చేయాలి అనుకోవడం విమర్శలకు దారితీస్తోంది.

Also Read : బియ్యం మాఫియా పై పవన్ ఫైర్.. కాకినాడ పోర్టులో పవన్ తుఫాన్

కర్ణాటక మహారాష్ట్రలో కూడా పుష్పా టికెట్ ధరల విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సినిమాకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా వసూలు చేయాలి అనుకోవడం ఏవిధంగా భావ్యమంటూ పలువురు మండిపడుతున్నారు. స్టార్ హీరోలకు నిర్మాతలు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చి అభిమానుల నుంచి ఆ సొమ్ముని వసూలు చేసుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్