ఆ మాట ఎలా అంటారు.. అసలు ఇలాంటి మాటలు అనొచ్చా.. సభ్య సమాజం తలదించుకునే మాట మీరు వాడుతున్నారు.. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మీ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి.. ఇవి వైసీపీ నేతలు చెబుతున్న మాటలు. ఇంకా చెప్పాలంటే.. వైసీపీ మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఇప్పుడు నీతి మాటలు మాట్లాడుతున్నారు. ఒక గౌరవమైన మంత్రిగా పని చేసిన పేర్ని నాని.. పోలీసులకు, కూటమి నేతలకు కూడా ఇప్పుడు ఎలా మాట్లాడాలి.. ఎలా వ్యవహరించాలి అనే విషయంపై క్లాస్ తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు మర్చిపోయినట్లున్నారు సదరు మాజీ మంత్రి గారు.
Also Read : బాబుకి తలనొప్పిగా మారుతున్న ఎమ్మెల్యేలు.. చర్యలెక్కడ?
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు.. 2019-24 మధ్య వైసీపీ నేతలు ఎలా రెచ్చిపోయారో ప్రతి ఒక్కరికీ తెలుసు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. టీడీపీ సానుభూతి పరులపై దాడులు చేశారు. పల్నాడు జిల్లాలో గ్రామాల్లో టీడీపీ నేతల వీధులకు అడ్డుగా గోడలు కట్టేశారు. ఇదేమని ప్రశ్నిస్తే.. దాడి చేయడంతో పాటు హత్యలు కూడా చేశారు. ఇక మంత్రి స్థానంలో ఉన్న కొడాలి వెంకటేశ్వర్రావు అలియాస్ కొడాలి నాని అయితే.. బొచ్చు పీక్కుంటావా.. అంటూ ఏకంగా అప్పటి ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి లెక్క లేనన్ని సార్లు నోరు పారేసుకున్నారు. ఇక అసెంబ్లీలోనే మంత్రులు అనిల్, అంబటి, రోజా, పేర్ని.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలానే ఉంది. ఇక వల్లభనేని వంశీ అయితే.. అప్పటి మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు నారా లోకేష్‌ను పప్పూ అంటూ సభలోనే కించపరిచే వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మచిలీపట్నం సీఐతో మచిలీపట్నం అసెంబ్లీ వైసీపీ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి అలియాస్ పేర్ని కిట్టూ గొడవ పడ్డారు. నువ్వు ఎవరు నన్ను ఆపడానికి.. హూ ఆర్ యూ.. నీ సంగతి చూస్తా.. అంటూ సీఐను కిట్టూ బెదిరించారు. దీంతో అప్పటి వరకు సహనంతో ఉన్న సీఐ.. చివరికి ఏం పీక్కుంటారో చూస్తా.. అంటూ సీఐ నోరు జారారు. ఇప్పుడు ఇదే పెద్ద తప్పు అంటున్నారు పేర్ని నాని. అసలు ఆ భాష ఏమిటి.. ఏం మాట్లాడుతున్నారు.. సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేశారని సీఐ మాటలను నాని తప్పుబట్టారు. అదే సమయంలో ఒక రాజకీయ నేతకు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన వ్యక్తిని ఏకవచనంతో పిలుస్తారా.. కనీస గౌరవం ఇవ్వరా అని కూడా నిలదీస్తున్నారు పేర్ని నాని.
Also Read : అమరావతి కోసం మహిళా ఎంపీలు.. రాష్ట్రానికి సంబంధం లేకపోయినా..!
పాపం ఇదే పేర్ని నాని వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలు, మహిళలపై జరిగిన లాఠీఛార్జ్, అక్రమ అరెస్టులు మర్చిపోయినట్లున్నారు. ఇంకా చెప్పాలంటే.. పేర్ని నానికి మతిమరుపు వచ్చిందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీ పాలనలో కొడాలి నాని వ్యాఖ్యలు చేస్తుంటే.. పక్కనే కూర్చుని పేర్ని నాని ఎంజాయ్ చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కులం ప్రస్తావిస్తూ.. కాపు నా కొడుకా.. అంటూ మీడియా ముందు వ్యాఖ్యలు చేశారు. పోలవరం పర్యటనలో తన కారు రానివ్వలేదని ఏలూరు డీఐజీ మీద అందరి ముందే కేకలు వేశారు. అసలు పీక్కోమనే మాట తప్పు అంటున్న పేర్ని నాని.. వైసీపీ నేత అనిల్ అయ్యా పీకే.. నువ్వేం పీకలేవు.. అనే మాట ఆయనకు తప్పుగా అనిపించలేదు. ఇక ధర్మాన కృష్ణదాస్, ద్వారంపూడి చంద్రశేఖర్ వంటి నేతలు లం భాష వాడితే అప్పుడు తప్పుగా అనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం సీఐ నోరు జారితే మాత్రం.. అది పెద్ద తప్పు అని పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

