Sunday, June 21, 2026 05:08 AM
Sunday, June 21, 2026 05:08 AM

సైలెంట్ గా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటి సిఎం

రాజకీయాల్లో చాలా హామీలు.. గాల్లో కలిసిపోతూ ఉంటాయి. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నప్పుడు వచ్చే ఇమేజ్, కిక్ వేరు. ఇప్పుడు ఈ కిక్ ఎంజాయ్ చేస్తున్నారు కూటమి పార్టీల కార్యకర్తలు, ముఖ్యంగా జనసేన అభిమానులు. డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుని.. శభాష్ అనిపించారు. అసలు ఏంటీ ఆ హామీ అనేది ఒకసారి చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు.. కాకినాడ జిల్లా తొండంగి, కొత్తపల్లి మండలాల పరిధిలో 8,180 ఎకరాలను సెజ్ కోసం సేకరించింది అప్పటి సర్కార్.

Also Read : విశ్వంభరా.. ఇక లేనట్లేనా..?

ఎకరాకు రూ.3 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వగా.. ఆ సమయంలో భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు ముందుకు రాకపోయినా.. వారిని భయపెట్టి, బలవంతంగా రిజిస్ట్రేషన్ లు చేయించారు. అందులో 2,180 ఎకరాలకు రైతులు పరిహారం తీసుకోకుండా.. తమ భూములు తమకు కావాలని ఉద్యమాలు చేసి జైలుకు కూడా వెళ్ళిన పరిస్థితి. ఇక 2014 లో టీడీపీ సర్కార్.. ఎకరాకు మరో 2 లక్షలు అదనంగా ఇచ్చింది. ఇవే భూముల్లో చంద్రబాబు ఏరువాక పున్నమి కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు.

Also Read : జాక్ పాట్ కొట్టిన ఏపీ.. గూగుల్ తో చారిత్రాత్మక ఒప్పందం..!

ఇక వైసీపీ హయాంలో.. తమతో అనుకూలంగా ఉన్న వారి భూములను వెనక్కు ఇచ్చేసి.. మరికొందరివి ఆపేశారు. దీనిపై ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రైతులకు.. హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భూములను మీకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చే విధంగా రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. స్టాంప్ట్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములు లేకుండా సెజ్ నుంచి 2,180 ఎకరాలు తిరిగి రైతుల పేరిట బదిలీ చేస్తారు. ఈ నిర్ణయంతో 1,551 మంది రైతులకు లబ్ధి కలగనుంది. ఈ నిర్ణయంతో సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్