Wednesday, February 25, 2026 01:04 AM
Wednesday, February 25, 2026 01:04 AM

ఆఫ్ ది రికార్డు వార్తలు.. పార్ట్ 3..!

గుంటూరు మిర్చి యార్డు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బాగా ఫేమస్. నిత్యం కోట్లల్లో లావాదేవీలు జరిగే యార్డు. చిన్న వ్యాపారి కూడా లక్షల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తాడు. అందుకే.. ఈ యార్డు పదవి కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేస్తారు. పదవి దక్కిన వారి దశ మారిపోతుందని అందరి నమ్మకం కూడా. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. చైర్మన్‌గా పదవీ బాధ్యతల స్వీకారానికి కోట్లు ఖర్చు పెట్టిన ఘనత కుర్రా అప్పారావుకే దక్కిందనేది ఇప్పుడు గుంటూరులోనే కాదు ఉమ్మడు గుంటూరు జిల్లాలోనే హాట్ టాపిక్. పత్రికల్లో ఇచ్చిన కలర్ ప్రకటనలతో పాటు ఇతర ఖర్చులు కలిపి.. ఎన్ని కోట్లు ఖర్చు అయిందో..! నిజంగా కుర్రా అప్పారావు కోసం ఆయన అభిమానులు, బంధుమిత్రులు కోట్లు ఖర్చుపెట్టారా..? ఈ కోట్లను తెర వెనుకుండి అప్పారావు స్వయంగా ఖర్చు పెట్టారా..? నిజానికి ఇంత హడావుడి చేయడం.. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టటం అంత అవసరమా..?

Also Read : క్రికెట్ లీగ్.. కెప్టెన్లు గా పవన్ వర్సెస్ లోకేష్..!

నాలా సింపుల్‌గా ఉండండి.. ఎలాంటి ఆర్భాటాలు వద్దు… హంగామాలు చేయవద్దు అని స్వయంగా సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నా కూడా తెలుగు తమ్ముళ్లు ఆ విషయంలో ఆయన మాట వినటం లేదు. పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో మంత్రి నారా లోకేష్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కుర్రా అప్పారావుకు యార్డు చైర్మన్ పదవి రావడానికి లోకేష్ కారణమని.. అందుకే ఆయన ఈ రూపంలో కృతజ్ఞత చూపించారనేది బాగా వినిపిస్తున్న మాట. పార్టీ కేంద్ర కార్యాలయం పెద్దలు అయితే.. కుర్రా అప్పారావు ఖర్చు హంగామా వెనుక కారణాలను ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కుర్రా అప్పారావు చేసిన హడావుడిపై ఇప్పుడు టీడీపీలో బాగానే చర్చ నడుస్తోంది.

అంబటి నోటి దూలకు బ్రేకులు పడవా..?

అంబటి రాంబాబు రిమాండు రిపోర్టులో ఏమేమి ఉందో అనే విషయం కంటే.. ఈ విధంగా ఉందని అంబటి ఆచరణలో చూపారు. అంబటి జైలుకు వెళ్లిందే చంద్రబాబును బూతులు తిట్టారని. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన తీరులో ఎలాంటి మార్పు రాలేదనేది ఇప్పుడు వైసీపీ నేతల మధ్య ఆఫ్ ది రికార్డు జరుగుతున్న చర్చ. “అరే కమ్మ నా కొడకల్లారా.. కమ్మ నా కొడుకులు ఇక్కడుంటే చంపేస్తా.. చంద్రబాబు కమ్మ నా కొడకా..” అని నేను ఎప్పుడైనా తిట్టానా.. నేను అనలేదు అంటూనే.. తన రిమాండ్ రిపోర్టులో కమ్మ పోలీస్ అధికారే ఇలా రాశారంటూ నోటికి వచ్చినట్లు కమ్మ కులంపై అంబటి రెచ్చిపోయారు. నిజానికి పోలీసులు రాశారో లేదో తెలియదు కానీ.. అంబటి రాంబాబు తన నోటితో తిట్టిన తిట్లను ఓసారి పరిశీలిస్తే.. ఆయన పనిగట్టుకొని మరీ.. కావాలని, అలా తిట్టినట్లు స్పష్టమవుతోంది.

Also Read : పాపం వైసీపీ.. అప్పుడు.. ఇప్పుడు ధర్నాలే..!

తన అరెస్టుకు ప్రతికారంగా అంబటి ఈ విధంగా కమ్మ కులం పై కక్ష తీర్చుకున్నారేమో..! అదేమిటంటే “నాకు ముగ్గురు కుమార్తెలుంటే.. ఇద్దరు కమ్మ కులం అల్లుళ్ళు ఉన్నారు..” అని అంబటి చెబుతున్నారు. ఒక వైపేమో కమ్మ కులాన్ని తిట్టారు. మరొక వైపేమో నా ఇద్దరు అల్లుళ్లు కమ్మ కులం వారంటున్నారు. కమ్మ కులం అల్లుళ్లను ఏమి అనలేక.. కమ్మ కులాన్ని ఆ విధంగా తిట్టి పోసి ఆ కులం పై తనకున్న అక్కసును ఈ విధంగా తీర్చుకున్నారేమో..? అని పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇక వైసీపీ నేతలే.. అంబటి నోటీ దూల ఇంకా తగ్గలేదు.. ఇలాగే మాట్లాడితే.. మళ్లీ అరెస్టు ఖాయమని ఆఫ్ ది రికార్డు వ్యాఖ్యానిస్తున్నారు.

రోజా అరెస్టు అనుమానామేనా..?

ఆడుదాం ఆంధ్రలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ మాజీ మంత్రి రోజా పై చర్యలు తీసుకుంటాం. త్వరలో రోజా అరెస్టు తప్పదు.. అని శాప్ చైర్మన్ రవి నాయుడు ఇప్పటికే ఎన్నోసార్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటింది. ఈ ప్రకటనలు చేస్తున్నారు తప్ప.. రోజాను టచ్ కూడా చేయలేకపోయారు. మరోవైపు రోజా ఇప్పటికీ చంద్రబాబు, పవన్, లోకేష్‌ సహా టీడీపీ నేతలపై ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. దుమ్మెత్తి పోస్తున్నారు. చిటికెన వేలు మీద వెంట్రుక కూడా పీకేలేరు అంటూ గతంలో రోజా చెప్పినట్లుగానే ఇప్పుడు పరిస్థితి కనిపిస్తోంది.

ఇంతకు రోజా పైన ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారంటే.. ఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో రోజాతో పాటు మరో పదిమంది ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారట. అందులో ప్రస్తుతం సీఎంఓలో పనిచేస్తున్న ప్రద్యుమ్న కూడా ఉన్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. రోజాను అరెస్టు చేస్తే.. పదిమంది ఐఏఎస్ అధికారులను కూడా అరెస్టు చెయ్యాల్సి ఉంటుందేమో.. ఆ తర్వాత ఇదే కేసులో సీఎంఓ ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్నను కూడా అరెస్టు చేయవలసి వస్తుంది. అందుకే రోజాను సీఎంఓ అధికారి ప్రద్యుమ్న కాపాడుతున్నారన్న ప్రచారం అటు శాప్‌లో ఇటు సచివాలయంలో జోరుగా జరుగుతోంది. మరి ఈ పుకార్లకు చెక్ ఎప్ప్పుడు పడుతుందో ఏమో..?

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జగన్ ను తిట్టోద్దని...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కల్తీ లడ్డు వ్యవహారంపై...

అందరి జాతకాలు బయటపెడతా..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్...

ప్లాన్ ప్రకారమే అంతా.....

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

తిరుమల పవిత్రతకు ప్రత్యేక...

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిరక్షణపై...

మరో వివాదంలో మోహన్...

గత రెండు మూడేళ్ళ నుంచి సినీ...

క్రికెట్ లీగ్.. కెప్టెన్లు...

ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల్లో స్నేహపూర్వక వాతావరణం...

పోల్స్