Tuesday, March 3, 2026 10:08 PM
Tuesday, March 3, 2026 10:08 PM

ఆఫ్ ది రికార్డ్.. అందుకే విందు రాజకీయం..!

అడుసు తొక్క నేల.. కాలు కడుగ నేల.. అనేది సామెత. ఈ మాట పార్టీల పెద్దలకు సరిపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎదురే లేదన్నట్లుగా ఉంటారు. పదవి పోయిన తర్వాత మాత్రం వాస్తవంలోకి వస్తారు. అధికార అహంకారం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి కూడా. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు నేనే రాజు.. అన్నట్లుగా వ్యవహరించారు వైఎస్ జగన్. తనకు ఎదురే లేదన్నట్లుగా నిర్ణయాలు తీసుకున్నారు. చివరికి మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా కలవలేదు. ఇందుకు ప్రతిఫలమే ఎన్నికల్లో ఘోర పరాజయం. 151 స్థానాల నుంచి ఏకంగా 11 స్థానాలకు పడిపోయింది వైసీపీ. ఇందుకు జగన్ నియంత పోకడలే కారణం.

ఆ విషయంలో జాగ్రత్తగా లోకేష్

అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో లోకేష్ మాటే ఫైనల్ అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తున్న మాట. ఇంకా చెప్పాలంటే.. లోకేష్ మాటకు ఎదురులేదు అనేది ప్రస్తుతం టీడీపీ నేతల్లో వినిపిస్తున్న మాట. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర ప్రధాన కారణం. అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లోకేష్ తీరు మారిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అలా లేదు. ఎందుకంటే.. నేతలు, కార్యకర్తలను చిన్న చూపు చూస్తే.. దాని పరిణామాలు ఎలా ఉంటాయో లోకేష్‌కు బాగా తెలుసు అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అలా నిర్లక్ష్యం చేయటం వల్లే జగన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని కూడా చెబుతుంటారు.

Also Read : మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 5 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

అందుకే ఇప్పుడు నూతన రాజకీయానికి లోకేష్ తెర తీశారు. అదేమిటంటే.. ఆత్మీయ విందు రాజకీయం. పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులకు కుటుంబ సమేతంగా విందు ఏర్పాటు చేశారు. వచ్చిన వారిని ఆత్మీయంగా పలకరించారు. వారికి బహుమతులిచ్చారు. అయితే దీని వెనుక అసలు కారణం ఏమిటనే అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కొందరు మంత్రులు కూడా వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ.. అవకాశం రాలేదు. ఈ విషయంపై కొంత వ్యతిరేకత ఉందనే విషయం తెలుసుకున్న లోకేష్.. ఆ గ్యాప్ ఫిల్ చేసేందుకు ఇలా విందు ఏర్పాటు చేసినట్లు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. కాబోయే సీఎం అంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు సన్నిహితంగా ఉండేందుకు.. లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. విందుకు కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించడం ద్వారా ఏడాదిన్నరగా దూరంగా ఉన్నామనే ఫీలింగ్‌ ఎమ్మెల్యేలలో ఒక్కసారిగా తొలగిపోయిందంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రైతులకు ఇచ్చిన డ్రోన్లు...

ప్రతి పనిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలనేది...

వారి మెడకే చుట్టుకున్న...

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్...

కల్తీ నెయ్యి కేసు:...

తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి...

అటవీశాఖలో సంస్కరణలు: పవన్...

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...

దేవుడి ముందే రచ్చ...

ఏపీలో ప్రతిపక్షమే లేదు. కానీ.. తెలుగుదేశం...

వారిని దూరం పెట్టారా..?...

ఉమ్మడి గుంటూరు జిల్లా నేతల తీరుపై...

పోల్స్