Saturday, September 19, 2026 11:18 PM
Saturday, September 19, 2026 11:18 PM

సరికొత్త నిబంధనలతో.. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా కారణాల రీత్యా పాస్ లు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ, మండలి లో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్ లతో పాస్ లను జారీ చేసారు. అసెంబ్లీ 1 వ గేట్ నుంచి మండలి చైర్మన్, స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ , సీఎం, డిప్యూటీ సీఎంలకు మాత్రమే అనుమతి ఉంటుంది. గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి ఇస్తారు.

Also Read : అసెంబ్లీకి జగన్.. అనర్హత భయంతోనేనా?

గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిస్తూ బులెటిన్ జారీ చేసారు. మండలి చైర్మన్, స్పీకర్, సీఎంలు వచ్చి వెళ్లే కారిడార్ లోకి ఇతరులెవ్వరికీ అనుమతి లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. నాలుగో గేట్ గన్ పాయింట్ మినహా భద్రతా సిబ్బందిని అనుమతించేది లేదని పేర్కొన్నారు. మంత్రులు, సభ్యుల పీఏలను అవసరం మేరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. శాసనసభా వ్యవహారాలతో సంబంధం లేని ప్రభుత్వ విభాగాల సిబ్బందికి ప్రాంగణంలోకి అనుమతి లేదని ఆదేశాలు ఇచ్చింది.

Also Read : ఆ రెండు పథకాల అమలు షురూ..!

శాసనసభ, మండలిలోకి సభ్యులు ఎవరూ ఆయుధాలతో రాకూడదని స్పష్టం చేస్తూ బులెటిన్ విడుదల చేసారు. ఒక వేళ వచ్చినా అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న బెల్ ఆఫ్ ఆర్మ్ లో డిపాజిట్ చేయాల్సిందిగా సూచించారు. ఆయుధాలు, లాఠీలు, ప్లకార్డులు, విజిల్స్ లాంటి వాటితో విధానపరిషత్ ప్రాంగణంలోకి ప్రవేశం లేదని వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా సభ్యుల పీఏలు, వ్యక్తిగత సిబ్బందిని తీసుకురావొద్దని స్పష్టంగా ఆదేశాలలో పేర్కొన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ మినహా ఇతర చోట్ల మీడియా సమావేశాలు నిర్వహించొద్దని సభ్యులకు, మంత్రులకు సూచనలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్