రాయలసీమ వాసులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కల సాకారమవుతోంది. నంద్యాల నుంచి సికింద్రాబాద్ వరకు ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ రైలు కావాలనే ఈ ప్రాంత వాసుల డిమాండ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు కేవలం బస్సు ప్రయాణం మాత్రమే అందుబాటులో ఉన్న మార్గంలో ఇకపై సూపర్ ఫాస్ట్ రైలు అందుబాటులోకి రానుంది. సుమారు 12 గంటలు పైగా సాగే ప్రయాణం ఇకపై కేవలం 5 గంటల్లోనే పూర్తి కానుంది. మూడు ప్రాంతాల ప్రజల కల త్వరలో సాకారం కానుంది.
Also Read : నేటి నుంచి అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. కీలక మార్పులు ఇవే..!
దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు రైల్వే మార్గం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అన్ని ప్రధాన రైల్వే మార్గాలను సూపర్ ఫాస్ట్ రైళ్లకు అనుగుణంగా అప్ గ్రేడ్ చేశారు. ప్రధాన మార్గాలన్నీ కూడా 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా అప్ డేట్ చేశారు. ఇక చాలా మార్గాల్లో ఇప్పటికే వందే భారత్ వంటి సెమీ హై స్పీడ్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు త్వరలోనే బుల్లెట్ రైలు కారిడార్ కూడా భారతీయులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే అహ్మదాబాద్ – ముంబై మార్గంలో బుల్లైట్ రైలు నిర్మిస్తున్నారు. త్వరలో సికింద్రాబాద్ – చెన్నై, సికింద్రాబాద్ – బెంగళూరు, చెన్నై – బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
దాదాపు 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే మార్గం ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయ్యింది. ఈ మార్గంలో ఇప్పటికే కనిగిరి వరకు ట్రైల్ రన్ కూడా పూర్తి చేశారు. దీంతో నయా ట్రాక్ అందుబాటులోకి వచ్చినట్లు అయ్యింది. ఇదే సమయంలో రాయలసీమలోని నంద్యాల నుంచి సికింద్రాబాద్ వరకు ఇంటర్ సిటీ రైలు నడపాలని చాలా రోజులుగా ఈ ప్రాంతాల వాసులు కోరుతున్నారు. ప్రస్తుతం నంద్యాల నుంచి సికింద్రాబాద్ వరకు డోన్, కర్నూలు, గద్వాల, మహబూబ్ నగర్ మీదుగా వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల ప్రయాణ దూరం ఎక్కువ అవుతుంది కూడా. ప్రధానంగా కంభం, మార్కాపురం, వినుకొండ ప్రాంతాలికు చెందిన వారు ఏకంగా 10 నుంచి 14 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది.
Also Read : వైసీపీ నేతలు డబుల్ గేమ్.. వాటి విషయం ఏమైంది..?
ప్రయాణీకుల విజ్ఞప్తి మేరకు త్వరలో నంద్యాల – సికింద్రాబాద్ మధ్య ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, వినుకొండ, 11 గంటలకు మార్కాపురం, కంభం, 12 గంటలకు గిద్దలూరు మీదుగా మధ్యాహ్నం 1.50 గంటలకు నంద్యాల చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 2.40 గంటలకు నంద్యాలలో బయలుదేరి.. రాత్రి 10.45 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. 4.15 గంటలకు మార్కాపురం, సాయంత్రం 5 గంటలకు వినుకొండ, రాత్రి 7.30 గంటలక మిర్యాలగూడలో ఈ రైలు ఆగనుంది. ఈ రైలులో మొత్తం 444 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల్లో చేరనుంది. ఈ రైలు ప్రకటనతో నంద్యాల, మార్కాపురం, పల్నాడు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

