Saturday, September 19, 2026 05:03 AM
Saturday, September 19, 2026 05:03 AM

తెలుగు బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఓ సెన్సేషన్.. ఎన్ని కోట్లంటే..?

హిందీలో పుట్టి దక్షిణాదిని కూడా ఏలుతున్న బిగ్ బాస్ అనగానే జనాల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ షో ఫాలోయింగ్ కు వయసుకు సంబంధం ఉండదు. ఆ రూల్స్, కండీషన్స్, ట్విస్ట్ లు కొందరిని బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ షో ని పర్సనల్ గా తీసుకుని బాధపడే వారు కూడా ఎక్కువే ఈ రోజుల్లో. ప్రతీ ఏటా.. ఇయర్ ఎండింగ్ లో వచ్చే ఈ షోకి సెలెక్షన్స్ కూడా హాట్ టాపిక్. సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళను, సినిమాలకు దూరంగా ఉండే వాళ్ళను సెలెక్ట్ చేస్తూ ఉంటారు.

Also Read : ఫ్రీ బస్.. రూల్స్ ఇవే.. వాళ్లకు కూడా నో చార్జ్

లేటెస్ట్ గా మన తెలుగు బిగ్ బాస్ 9 ప్రోమో రిలీజ్ చేసారు. గత షోల కంటే ఇది కాస్త డిఫరెంట్ అనే క్లారిటీ ఇచ్చేసారు. ఈసారి బిగ్ బాస్‌లో రెండు హౌస్‌లు ఉండబోతున్నాయట. ఒకటి సెలబ్రిటీలు.. రెండు సామాన్యులు.. ఇప్పటికే కామన్‌మ్యాన్ సెలక్షన్స్ కోసం ప్రాసెస్‌ని కంప్లీట్ చేసి.. వాళ్లలో 40 మంది సెలెక్ట్ చేసి, అగ్నిపరీక్ష హౌస్‌లోకి పంపుతున్నారు. వీరి నుంచే కామన్‌మ్యాన్ కంటెస్టెంట్స్‌ ని సెలెక్ట్ చేస్తారు. ఈ ప్రోమోను లేటెస్ట్ గా రిలీజ్ చేసారు. ఇందులో నాగార్జునతో పాటుగా వెన్నెల కిషోర్ కూడా కనిపించాడు.

Also Read : రాహుల్ అరెస్ట్.. ఢిల్లీలో అలజడి వాతావరణం

గతంలో హిందీ బిగ్ బాస్ కూడా ఇలాగే రెండు హౌస్ లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ షో లో హోస్ట్ గా ఉన్న నాగార్జునకు.. 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు ఇవ్వడానికి స్టార్ మా రెడీ అయింది. బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఎందరో హోస్ట్ లు వచ్చినా.. నాగార్జున మాదిరిగా ఎవరూ అలరించలేదు. దీనితో ఆయన కూడా డిమాండ్ ను అర్ధం చేసుకుని గట్టిగా డిమాండ్ చేసినట్టు టాక్. బుల్లితెర ప్రేక్షకుల మైండ్ తెలిసిన నాగార్జున.. పలు ఐడియాలు కూడా ఇస్తూ ఉంటారట. దీనితో ఆయనకు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడం రీజనబుల్ అని భావించి.. ఓకే చేసిందట స్టార్ మా యాజమాన్యం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్