Wednesday, August 5, 2026 06:46 AM
Wednesday, August 5, 2026 06:46 AM

MORE THAN A MINISTER.. పర్చూరు అభివృద్ధిపై ఏలూరి మార్క్

కొంతమంది నేతలు తాము పని చేసినా సరే దాని గురించి పెద్దగా చెప్పుకునే ప్రయత్నం చేయరు. అందులో ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందు వరుసలో ఉంటారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో అప్పుడప్పుడే కనపడే ఎమ్మెల్యే.. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మాత్రం పక్కా ప్లానింగ్ తో పనులు జరిపిస్తున్నారు. గత 5 ఏళ్ళ నుంచి అభివృద్దికి దూరమైన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఏలూరి సక్సెస్ అవుతున్నారు.

Also Read : ఓట్ల కోసం ఆల్‌ ఫ్రీ.. భారం ఎవరిపైనా..?

అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో లేదంటే సాధారణ రోజుల్లో.. మంత్రులు, ప్రభుత్వ పెద్దలను, అధికారులను ఏదోక రూపంలో కలుస్తూ ఉండే ఏలూరి.. సచివాలయానికి వెళ్ళినా, అసెంబ్లీకి వెళ్ళినా, చివరికి పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్ళినా ఏదోక అభివృద్ధి కార్యక్రమానికి నిధులు సాధించే తిరిగి పర్చూరు వెళ్తున్నారు. సౌమ్యుడిగా గుర్తింపున్న ఏలూరి.. నియోజకవర్గ నేతలను సమన్వయం చేసుకుంటూ తాను ఏం చేయలగనో చేసి చూపిస్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలో రోడ్లపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

Also Read : లోకేష్‌కు అదిరిపోయే బర్త్‌ డే గిఫ్ట్..!

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు గేట్ వేలా ఉండే పర్చూరు నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో… ఇప్పుడు గ్రామ స్థాయిలో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు వద్ద కూడా ఎమ్మెల్యేపై మంచి అభిప్రాయం ఉండటంతో.. నిధులు సాధించడం కూడా సులువు అవుతోందనే అభిప్రాయం వినపడుతోంది. అటు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ నుంచి కూడా ఏలూరికి సహకారం అందడంతో తాను ఏం చేయగలనో నిరూపించే పనిలో పడ్డారు ఎమ్మెల్యే.

Also Read : సెహ్వాగ్ కూడా విడాకులే.. క్రికెటర్స్ ను వదలని డైవర్స్

జిల్లా నేతల మధ్య సమన్వయం విషయంలో కూడా ఏలూరి చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ నేతల మధ్య విభేదాలు ఉంటే.. ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తన శైలిలో సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. ఇక యువ నేతలను ప్రోత్సహిస్తూ సీనియర్ నేతలకు వారిని దగ్గర చేస్తూ జిల్లాలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నారు. రాజకీయంగా పార్టీకి తాను ఏం చేయగలనో అది చేసి చూపిస్తున్నారు. దీనితో జిల్లా నేతలు కూడా తమ సమస్యల పరిష్కారానికి ఏలూరినే ఎంచుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్