Wednesday, May 6, 2026 11:38 PM
Wednesday, May 6, 2026 11:38 PM

చంద్రబాబు, లోకేష్ పేషీల చుట్టూ ప్రదక్షణలు

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇటీవల ఉపాధ్యాయ ఎన్నికలు.. అలాగే కృష్ణ ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పూర్తికాగా.. ఖాళీగా ఉన్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ఏపీ అధికార కూటమిలో ఆశావాహుల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పటివరకు ముగ్గురు నలుగురు పేర్లు మాత్రమే వినపడగా.. అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఆశవాహుల సందడి ఆశ్చర్యం కలిగించింది. ఎమ్మెల్సీ టికెట్ల కోసం చంద్రబాబు.. లోకేష్ పేషీల వద్ద కొలహల వాతావరణం కనపడింది.

Also Read : సీఎం పర్యటన… ఆ ప్రాంత వాసుల కల నెరవేరేనా..?

చంద్రబాబును అలాగే లోకేష్ ను కలిసి తమకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. వారిలో బీద రవీంద్ర యాదవ్, కొమ్మలపాటి శ్రీధర్, బుద్ధ వెంకన్న, బీటి నాయుడు, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, ఏరాసు ప్రతాపరెడ్డి, మల్లెల లింగారెడ్డి, రెడ్డి సుబ్రమణ్యం, జంగా కృష్ణమూర్తి.. వంటి వాళ్ళు ఎమ్మెల్సీ సీట్ల కోసం సచివాలయంతో పాటుగా అసెంబ్లీలో హడావిడి చేస్తున్నారు. అయితే దేవినేని ఉమా, వంగవీటి రాధ తో పాటుగా మాజీ మంత్రి కే.ఎస్ జవహర్ పేర్లు కూడా ప్రముఖంగా వినపడుతున్నాయి.

Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వరుస గిఫ్ట్ లు రెడీ…!

జనసేన నుంచి నాగబాబు పేరు ప్రముఖంగా వినపడుతోంది. అలాగే బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు కూడా చర్చల్లో ఉంది. అయితే వీరిలో ఎక్కువగా వంగవీటి రాధా, కె.ఎస్ జవహర్, నాగబాబు పేర్లు మాత్రమే దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకుంటామని.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకు ఎమ్మెల్సీ దక్కడం ఖాయంగా కనబడుతోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. శాసనసభలో వైసీపీకి బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా.. ఐదుగురు ఎమ్మెల్సీలను కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్