Wednesday, May 6, 2026 11:50 PM
Wednesday, May 6, 2026 11:50 PM

నాపై కక్ష అందుకే… మనోజ్ సంచలనం

మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. రోజు రోజుకు విభేదాల తీవ్రత పెరగడంతో అసలు ఏం జరగబోతుంది అనే ఆసక్తి నెలకొంది. ఇక తన కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉంది అంటూ మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేయడం పట్ల… మంచు మనోజ్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు చేసాడు మనోజ్. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మనోజ్ ఈ సందర్భంగా కోరడం గమనార్హం.

Also Read: ఆయనకే ఎందుకు అవకాశం సార్…?

కుటుంబ ఆస్తుల కోసం నేను ఎప్పుడూ ఆశ పడలేదన్న మనోజ్… కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని స్పష్టం చేసాడు. ఈ వివాదాల్లో నా కూతుర్ని కూడా లాగటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసాడు. గత కొన్నాళ్ల నుంచి ఇంటి నుంచి మా కుటుంబం దూరంగానే ఉంటున్నామని… నా ముందే నా కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా తిట్టారని ఆవేదన వ్యక్తం చేసాడు. ఇంటిలో ఉండాల్సిన సిసి ఫుటేజీ కెమెరాలు మాయమైనాయని నా అన్న విష్ణు దుబాయ్ కి ఎందుకు వెళ్ళాడు అందరికీ తెలుసన్నాడు.

Also Read: మనోజ్ ను ఇంత దారుణంగా కొట్టారా…? గోళ్ళతో గీరింది ఎవరు…?

విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని మండిపడ్డాడు. ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయ రెడ్డి ,కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారని నేను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదన్నాడు. ఆస్తులు కావాలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని స్పష్టత ఇచ్చాడు. నేను నా భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నామన్న మనోజ్ విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని విద్యాసంస్థలోని బాధితులకు నేను అండగా ఉన్నాను అన్నాడు. బాధితుల పక్షాన నిలబడ్డందుకు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేసాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్