బెజవాడ బస్టాండ్.. ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడో ఒక చోటకి ప్రయాణం చేస్తూనే ఉంటారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ప్రాంత బస్టాండ్ గా మారిపోయింది. అలాంటి బస్టాండ్ లో ఇప్పుడు ఆందోళన కనపడుతోంది. ఒక్క తుపాకి ప్రయాణికులను భయపెట్టింది. శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున విజయవాడ బస్టాండ్ లో కార్దన్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ప్రయాణికుల బ్యాగ్ లను తనిఖీలు చేసారు పోలీసులు.
Also Read : దువ్వాడకు రూల్స్ తెలియదా..? మరో వివాదంలో మాధురి..!
ఈ క్రమంలో కృష్ణ లంక పోలీసులు.. బస్టాండ్ కు సమీపంలో ఉన్న బాలాజీ హోటల్ లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా ఓ వ్యక్తి బ్యాగ్ ను తనిఖీ చేసే ప్రయత్నం చేసారు.. హెడ్ కానిస్టేబుల్ సారధి నాయక్. ఆ సమయంలో బ్యాగ్ లో ఉన్న తుపాకీ తీసి.. హెడ్ కానిస్టేబుల్ ను కాల్చే ప్రయత్నం చేసాడు ఆ వ్యక్తి. అతని వద్ద 9 ఎంఎం తుపాకీ, 5 రౌండ్ ల బులెట్ లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వెంటనే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా, రాజీవ్ గాంధీ పార్క్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
Also Read : ఇండియాతో అమెరికా కామెడీ.. 30 రోజుల పర్మిషన్..!
దీనితో ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం అయింది. వేల మంది నిత్యం బస్టాండ్ కు వస్తూ ఉంటారు. బస్టాండ్ లోనే సెర్ప్, ఆప్కాస్, ఏసీబీ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. ఆర్టీసి కీలక అధికారులు అందరూ ఈ బస్టాండ్ లోనే ఉంటారు. ఇలాంటి ప్రాంతంలో.. తుపాకి దొరకడంతో.. అసలు ఏం జరుగుతుందనే భయం మొదలైంది. అది కూడా రాజధాని దగ్గరగా ఉండటంతో.. అతను ఎందుకు తుపాకీతో వచ్చాడనే భయం కూడా వ్యక్తమవుతోంది. మావోల కదలికలా.. లేదంటే ఎవరికైనా గురి పెట్టారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

