Saturday, September 5, 2026 12:14 AM
Saturday, September 5, 2026 12:14 AM

సీమలో భూమి బంగారం..! ఎకరా ధర వింటే షాక్..!

ఎకరా కోటిన్నర.. సాధారణంగా ఇంత ధర పలికేది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రమే. గోదావరి జిల్లాల్లో కోటి రూపాయల వరకు ధర ఉంటుంది. ఉత్తరాంధ్రలో అయితే.. ఓ 50 లక్షల వరకు పలుకుతుంది. కానీ రాయలసీమ ప్రాంతంలో మాత్రం.. 10 నుంచి 20 లక్షల రూపాయల ధర పలకడమే చాలా కష్టం. కొన్ని ప్రాంతాల్లో అయితే వేలల్లోనే పలుకుతుంది. కానీ తాజాగా ఎకరా కోటిన్నర అనే మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోంది. అయితే ఇది అమరావతి ప్రాంతంలోనో.. లేక గోదావరి జిల్లాల్లోనో కాదు.. రాయలసీమలో.. అది కూడా కరువు జిల్లా అని ముద్ర పడిన అనంతపురం జిల్లాలో.

Also Read : హిందూ ఓటర్లను వదిలేద్దాం.. వైసీపీ తెలివిగా ఆడుతోందా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ కోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో దూసుకుపోతోంది. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానంతో పరిశ్రమలు, కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మారుతున్న పరిస్థితులకు తగిన విధంగా వ్యూహాలతో ముందుకు సాగుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్లలో అభివృద్ధి చేస్తున్న మూడు నోడ్‌లలో పరిశ్రమలకు భూమి కేటాయించడానికి ప్రత్యేకంగా పాలసీ తీసుకొచ్చింది. విశాఖపట్నం – చెన్నై, హైదరాబాద్ – బెంగళూరు, చెన్నై – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లలో ఉన్న కొప్పర్తి, ఓర్వకల్లు, కృష్ణపట్నం నోడ్‌లలో ఉన్న పరిశ్రమలకు ఈ పాలసీ వర్తిస్తుంది.

Also Read : పోలీసులకు పిచ్చి ఎక్కిస్తున్న కేతన్ కేసు.. ప్రూవ్ చేయడం కష్టమేనా..?

ఏపీ ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్లలోని నోట్లకు సంబంధించి పరిశ్రమలకు కేటాయించే భూముల ధరల్ని ఖరారు చేసింది. అత్యధికంగా నెల్లూరు జిల్లా క్రిస్ సిటీలో ఎకరా భూమిని రూ.1.74 కోట్లకు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులోని నోడ్‌లో ఎకరా రూ.1.50 కోట్లుగా ఫిక్స్ చేశారు. కడప జిల్లాలో ఎకరా రూ.1.25 కోట్లు ఖరారు చేశారు. కేంద్రం నిర్ణయించిన ధరలే ఫిక్స్ చేశారు. ఏపీ పొరుగున్న ఉన్న కర్ణాటకతో పాటుగా మహారాష్ట్ర, గుజరాత్‌లో కూడా ఇలాగే క్లస్టర్లలో పరిశ్రమలకు భూములకు సంబంధించి ధరలు ఖరారు చేశారు. గుజరాత్, ముంబైలో ఎకరా రూ.2.25 కోట్లకు ఫిక్స్ చేశారు. పారిశ్రామికవేత్తల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని చెబుతున్నారు.

Also Read : ఆ ముగ్గురి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..!

రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ నోడ్‌లకు సమీపంలో ఎకరా రూ.20 నుంచి 30 లక్షలకు భూములు అందిస్తున్నట్లు కేంద్రం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఈ ధరలతో పోలిస్తే ఇండస్ట్రియల్ నోడ్‌లలో భూముల ధరలు 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. దీంతో కేంద్రం ఈ నోడ్‌లలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తునందున ఈ ఖర్చును భరించి రాబట్టేందుకు వీలుగా కేంద్రం ధరల్ని ఫిక్స్ చేసింది. కాకపోతే ముందుగా వచ్చే ప్రాజెక్టులకు మాత్రం 25శాతం రాయితీ ఇచ్చేందుకు అనుమతించింది. అది కూడా ప్రోత్సాహకం కింద ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇండస్ట్రియల్ కారిడార్లకు సంబంధించిన భూముల్ని ఏ ధరకు విక్రయించాలో తమ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని, ఐఆర్ఆర్‌కు సంబంధించి కేంద్రం నిబంధన విధించింది. ఈ ధరలకే భూములు విక్రయించాల్సి ఉంటుందంటున్నారు అధికారులు.

క్రిస్ సిటీలో ముందుగా ఈ భూములు కేటాయింపు ప్రారంభించాలని ప్లాన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొప్పర్తి, ఓర్వకల్లు, కృష్ణపట్నం నోడ్‌లలో కలిపి దశల వారీగా 29,254 ఎకరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రం భూముల్ని కేటాయిస్తే.. కేంద్ర సంస్థ నిక్‌డిక్ట్.. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్.. అభివృద్ధి చేస్తోంది. మూడు నోడ్‌లలో కలిపి మొదటి దశలో భాగంగా మౌలిక సదుపాయాలకు మొత్తం 7,225 ఎకరాల్లో దాదాపు రూ.3,300 కోట్లు నిక్‌డిక్ట్ ఖర్చు చేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వివేకా హత్య కేసులో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

నేను సీఎం అవుతా.....

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రాంతీయ పార్టీ...

ఇంటింటికీ తెలుగుదేశం క్రేజీ...

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం రెండేళ్ల...

జనంలోకి జగన్.. పాదయాత్ర...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పాదయాత్రల వేడి...

కొండా సురేఖ సంచలన...

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ...

బొండా ఫ్యామిలీకి చంద్రబాబు...

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నగారా...

పోల్స్