Saturday, June 20, 2026 11:35 PM
Saturday, June 20, 2026 11:35 PM

కేటీఆర్ ప్రవర్తనతో బలపడుతున్న అనుమానాలు

జాన్వాడ ఫాం హౌస్ లో జరిగిన ఓ పార్టీ విషయంలో ఇప్పుడు తెలంగాణాతో పాటుగా ఏపీ ప్రజలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను అనుమానాలతో చూడటం మొదలుపెట్టారు. గతంలో కేటిఆర్ పై వచ్చిన ఆరోపణలే ఇందుకు కారణం. పార్టీ జరిగిన తీరు, ఆ తర్వాత బీఆర్ఎస్ చేసిన హడావుడితో అనుమానాలు ఇంకా బలపడ్డాయి అనే కామెంట్ వినపడింది. తప్పు చేయకపోతే పోలీసులను అనుమతించాలి. సోదాలు చేసుకోవడానికి గాని ఎవరిని అయినా అదుపులోకి తీసుకోవడానికి గాని అడ్డు తగలకూడదు.

Janwada Rave Party

ఉదయం నుంచి అంత రచ్చ జరుగుతోంటే కేటిఆర్ ఎప్పుడో రాత్రికి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. కేటిఆర్ కంటే తలసాని ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి… దమ్ముంటే కేటిఆర్ ను అరెస్ట్ చేయాలని సవాల్ చేసారు. ఆ తర్వాత సాయంత్రానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేటిఆర్… చెప్పాల్సిన సమాధానాలు చెప్పలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫ్యామిలీ పార్టీ అని మీరు చెప్తున్నారు సరే… ఆ పార్టీలో మీరు ఎందుకు లేరు, ఇన్ని ఆరోపణలు వస్తుంటే మీరు సిసిటీవీ ఫుటేజ్ ఎందుకు విడుదల చేయలేదు..

అంటే కేటిఆర్ నుంచి సమాధానం లేక సీరియస్ అయ్యారు. ఇక్కడ కేటిఆర్ ప్రభుత్వాన్ని పోలీసులకు సవాల్ చేయాల్సి కూడా ఉంటుంది. కాని అదేం జరగలేదు… దమ్ముంటే నాకు డ్రగ్స్ టెస్ట్ చేసుకోండి అని సవాల్ చేయాలి… దమ్ముంటే సీసీటీవీ ఫుటేజ్ ప్రజలకు చూపించండి అని సవాల్ చేయాలి… విజయ్ మద్దూరి అక్కడ అసలు డ్రగ్స్ తీసుకోలేదు… అతనికి మాకు సంబంధం లేదని చెప్పాలి… తన కుటుంబ సభ్యులు ఆ పార్టీలో ఉన్నారని ప్రూవ్ చేయాలనీ సవాల్ చేయాలి… ఇవేమీ కేటిఆర్ చేయలేదు. అటు సోషల్ మీడియాలో కూడా కేటిఆర్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కరువైంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్