Sunday, June 21, 2026 03:52 AM
Sunday, June 21, 2026 03:52 AM

బోరుగడ్డ కేసులో కీలక పరిణామం

గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం సహా పలు కేసుల్లో అరెస్ట్ అయిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. మధ్యంతర బెయిల్ తో బయటకు వెళ్లి వచ్చిన అనీల్.. జైలులో లొంగిపోయాడు. మధ్యంతర బెయిల్ వ్యవహారం సంచలనంగా మారింది. అతను తప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ సమర్పించి కోర్ట్ ను సైతం మోసం చేసాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో అతనిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

Also Read : జగన్‌ను అనుకరిస్తున్న కేటీఆర్..!

అనుబంధ పిటిషన్‌పై సోమవారం కోర్టులో విచారణ జరగగా… కోర్టు నిర్దేశించిన సమయంలోపు జైలు అధికారుల ముందు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని బోరుగడ్డను హైకోర్టు ఆదేశించింది. తప్పుడు ధృవపత్రం సమర్పించి మధ్యంతర బెయిల్ పొందిన వైనంపై విచారణ నివేదికలను సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఏపీ హైకోర్టు వారం రోజుల పాటు కోర్ట్ వాయిదా వేసింది. తన తల్లికి హార్ట్ సర్జరీ చేయించాల్సి ఉందని ఓ లేఖను సృష్టించాడు అనీల్.

Also Read : విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకి రంగం సిద్దం..!

గుండె సంబంధిత ఇబ్బందితో తల్లి ఇబ్బంది పడుతోందని.. చెన్నై ఆస్పత్రిలో ఉన్నారని కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలంటూ గతంలో హైకోర్టులో బోరుగడ్డ పిటిషన్ వేసాడు. ఈ పిటిషన్‌ దాఖలు చేసిన సమయంలో గుంటూరుకు చెందిన ఓ డాక్టర్ ఇచ్చిన రిపోర్టును కోర్టుకు సమర్పించాడు. ఆ రిపోర్ట్ పై అనుమానాలు రావడంతో పోలీసులు విచారణ చేసి.. అతని తప్పుడు డాక్యుమెంట్ అని గుర్తించారు. అతను జైలు నుంచి విడుదలైన విషయం కూడా ఎవరికి తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్