Wednesday, August 5, 2026 11:38 AM
Wednesday, August 5, 2026 11:38 AM

నాయర్ సెకండ్ ఛాన్స్ అయిపోయిందా..?

అంతర్జాతీయ క్రికెట్ లో ఒక్కసారి అవకాశం వస్తే పాతుకుపోవాలి. రెండవ సారి అవకాశం అనేది కల. కాని ఆ కలను నెరవేర్చుకున్నాడు సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్. 8 ఏళ్ళ క్రితం భారత టెస్ట్ జట్టులోకి వచ్చిన నాయర్ ట్రిపుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కాని ఆ తర్వాత అతనికి మళ్ళీ అవకాశం రాలేదు. అనూహ్యంగా గత ఏడాది, ఈ ఏడాది దేశవాళి సీజన్ లో అతను అంచనాలకు మించి రాణించడంతో నాయర్ ను మళ్ళీ జాతీయ జట్టులోకి తీసుకున్నారు.

Also Read : గిల్ టెక్నిక్ డెవెలప్ కావాల్సిందేనా..? మాజీ కెప్టెన్ హాట్ కామెంట్స్

ఐపిఎల్ లో కూడా చోటు సంపాదించాడు. ఇదే సమయంలో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కావడంతో నాయర్ నుంచి భారీ ఇన్నింగ్స్ లు ఆశించారు. కాని సీన్ మారింది.. అతని ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆరు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసిన నాయర్ చేసిన పరుగులు కేవలం 131 మాత్రమే. ఓ వైపు యువ ఆటగాళ్ళు జట్టులో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సమయంలో అతను వచ్చిన అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Also Read : ఆర్సీబీకి షాక్ ఇచ్చిన కన్నడ సర్కార్

మూడు టెస్ట్ లలో అతను ఘోరంగా ఫెయిల్ అయ్యాడు అని చెప్పలేం గాని.. కీలక సమయాల్లో వికెట్ చేజార్చుకున్నాడు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ నుంచి అతనికి పూర్తి సహకారం ఉంది. కాని దానిని నిలబెట్టుకోలేక విఫలం అవుతున్నాడు. మూడవ టెస్ట్ లో వికెట్ కోల్పోయిన విధానం అభిమానులను నిరాశపరిచింది అనే చెప్పాలి. దీనితో అతని కెరీర్ ముగిసింది అనే కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. కీలకమైన మూడవ స్థానంలో బ్యాటింగ్ వస్తున్న నాయర్ ను.. నాలుగో టెస్ట్ కు పక్కన పెట్టడం ఖాయం అంటున్నాయి భారత క్రికెట్ వర్గాలు. అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

పోల్స్