Wednesday, August 5, 2026 12:29 PM
Wednesday, August 5, 2026 12:29 PM

జగన్ కు ఏం దొరకడం లేదా..? అందుకే పాత రాగం..!

మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సారథ్యంలోని వైసీపీ పదేపదే విమర్శలు చేయడం ప్రభుత్వానికి కొంత తలనొప్పిగా మారింది. ఈ అంశానికి సంబంధించి ఇటీవల జగన్ మాట్లాడిన మాటలతో.. పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకు రావడం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వ స్వయంగా జోక్యం చేసుకోవడంతో కొంత మార్పు కనపడుతుంది. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ స్వయంగా జోక్యం చేసుకోవడం.. పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్లతో మాట్లాడటం వంటివి జరుగుతున్నాయి.

Also read : ఏపీలో ఇప్పటికీ కొనసాగుతున్న వైఎస్ జగన్ పాలన..!

అయితే గత మూడు నెలల నుంచి వైసీపీ ఇదే అంశంపై విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు వైసిపికి మరో అంశం దొరకకపోవడమే ఈ అంశంపై విమర్శలు చేయడం కారణం అనే కామెంట్స్ వినపడుతున్నాయి. అటు ప్రజా ఉద్యమంలో విషయంలో కూడా వైసిపి పెద్దగా ముందుకు రావడం లేదు. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి విమర్శలు చేయాలని భావించినప్పటికీ.. ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో వైసిపి ఈ అంశం మీద మాత్రమే ముందుకు వెళుతుంది. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినప్పటికీ జగన్ మాత్రం వదలడం లేదు.

Also read : ఇది కూడా సీబీఐకే..? రేవంత్ సంచలన నిర్ణయం..?

అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంలో వెనక్కి తగ్గకపోవడం.. ఎలాగైనా సరే ఈ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలని భావించటం కొంత రాజకీయాన్ని వేడెక్కించింది. అయితే ఈ అంశంలో జగన్ లేదంటే కొంతమంది వైసిపి నేతలు మినహా మిగిలిన నాయకులు పెద్దగా స్పందించడం లేదు. అటు సోషల్ మీడియాలో సైతం వైసీపీ క్యాడర్ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగాలకు ఎక్కువగా వైసీపీ ప్రాధాన్యత ఇస్తుంది. దీనితో వైసిపి సోషల్ మీడియా లో ఈ పి పిపీ విధానం మరుగున పడిపోయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్