Tuesday, March 3, 2026 08:38 PM
Tuesday, March 3, 2026 08:38 PM

అన్నా.. మీరే దిక్కు.. మీరే రావాలి..!

వైసీపీ ప్రక్షాళనకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టినట్లు ఉన్నారు. వైసీపీ ఘోర పరాజయానికి ఒంటెద్దు పోకడలే కారణమనేది బహిరంగ రహస్యం. అలాగే కొందరు నేతల తీరు వల్ల సొంత పార్టీ నేతలే తీవ్ర ఇబ్బందులు పడ్డారు కూడా. చివరికి విజయసాయిరెడ్డి వంటి జగన్ సన్నిహితులు కూడా.. జగన్ చుట్టూ కోటరీ చేరిందని.. వారి వల్లే వైసీపీ ఓడిపోయిందని బహిరంగంగానే విమర్శలు చేశారు. దీంతో తాను తిరిగి అధికారంలోకి రావాలంటే.. ముందుగా పార్టీని గాడిలో పెట్టే సమర్థమైన నాయకత్వం కావాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : ప్లీజ్.. అతన్ని రీప్లేస్ చేయండి..!

రాజకీయ దురంధరుడిగా పేరున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు వైసీపీలో మరింత గౌరవం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఒక రకంగా ‘కీ’ రోల్ పోషించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి ‘రౌతు’గా మారనున్నారు. ఆ దిశగా పార్టీ అధిష్టానం, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం, వ్యూహరచనలో దిట్టగా పేరుగాంచిన ధర్మానను ఉన్నత స్థానంలో ఉంచి.. తాను ప్రజలతో మమేకం కావాలని జగన్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని నడపగల సమర్ధత ఉన్న నేతగా ధర్మానను జగన్ ఎన్నుకున్నట్లు సమాచారం.

వాస్తవానికి ధర్మాన ప్రసాదరావు ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లాను దాటి రాలేదు. తన పరిధుల్లోనే రాజకీయాలు నెరిపిన సీనియర్ నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాజకీయ పార్టీల నేతలతో మంచి సంబంధాలున్నాయి. ఇప్పుడు ఆయనను రాష్ట్ర శిఖరంపై కూర్చోబెట్టనున్నారు జగన్. దీనికి ప్రత్యేకమైన కారణాలూ లేకపోలేదు. అప్పటి కాంగ్రెస్, ఇప్పటి వైసీపీలో ధర్మానకు గట్టిపట్టు ఉంది. నేతలందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయి. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసి ఉండడం, దివంగత రాజశేఖరరెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఉండిన చరిత్ర ఆయనకు అనుకూలంగా మారిందని జగన్ సన్నిహితుల మాట. ఇక ఇప్పుడున్న నేతలందరూ ధర్మానకు సహచరులుగానో, అనుచరులుగానే ఉన్న వారే.

Also Read : ఏఐ డీప్‌ఫేక్ కలకలం : మహిళ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసుల కేసు నమోదు!

ఇక వీటితో పాటు బలమైన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం ఆయనకు మరో ప్లస్ పాయింట్. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాతో పాటు.. రాష్ట్ర వ్యాప్త బాధ్యతలు కూడా ధర్మానకు అప్పగిస్తే.. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని జగన్ ఆలోచిస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను తనదైన వ్యాఖ్యలతో ధర్మాన నిలదీస్తారనేది జగన్ అభిప్రాయం. నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ధర్మానకు ప్రత్యేక స్థానం దక్కింది. వైసీపీలో కూడా జగన్ మంత్రివర్గంలో ధర్మాన సోదరులకు అవకాశం దక్కింది. గొప్ప వ్యూహ చతురతగా ధర్మానకు పేరు.కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సహా పలువురు ఉత్తరాంధ్ర నేతలు.. తామంతా ధర్మాన పొలిటికల్ కాలేజీ స్టూడెంట్స్ అని చాలా సార్లు చెప్పారు.

ప్రస్తుతం వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న బొత్స సత్యనారాయణ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. దూకుడుగా వ్యవహరించే అంబటి రాంబాబు, పేర్ని నాని, జోగి రమేష్, కాకాణి గోవర్థన్ రెడ్డి వంటి నేతలకు నోటి దూల అనే పేరుంది. వీరికి బాధ్యతలు అప్పగిస్తే.. అది పార్టీని మరింత కష్టాల్లోకి నెడుతుందని జగన్ తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీనియర్లలో ధర్మానకు కీలక పదవి ఇస్తేనే.. అది పార్టీకి కూడా మేలు జరుగుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థుల వ్యూహాలకు, ప్రతీ వ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తు వేసే నైపుణ్యం ధర్మాన సొంతం. దీంతో ఆయన చేతికి వైసీపీ పగ్గాలు ఇస్తే.. పార్టీకి భవిష్యత్తు ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రైతులకు ఇచ్చిన డ్రోన్లు...

ప్రతి పనిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలనేది...

వారి మెడకే చుట్టుకున్న...

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్...

కల్తీ నెయ్యి కేసు:...

తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి...

అటవీశాఖలో సంస్కరణలు: పవన్...

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...

దేవుడి ముందే రచ్చ...

ఏపీలో ప్రతిపక్షమే లేదు. కానీ.. తెలుగుదేశం...

వారిని దూరం పెట్టారా..?...

ఉమ్మడి గుంటూరు జిల్లా నేతల తీరుపై...

పోల్స్