ఇజ్రాయిల్, అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్దంలో.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే విషయం పక్కన పెడితే.. ఇప్పుడు అమెరికా ఈ యుద్దంలో నిండా మునిగింది అనే సంకేతాలు కనపడుతున్నాయి. ఇరాన్ వదులుతున్న షాహెద్ డ్రోన్ లు.. అమెరికా రక్షణ వ్యవస్థలకు భారీ నష్టం చేకూర్చగా.. అటు కువైట్ లో అమెరికాకు చెందిన పలు విమానాలు కూడా కూలిపోయాయి. ఇక తాజాగా ఇరాక్ లో మరో విమానం కూలిపోయింది. ఇప్పుడు ఓ వార్త అమెరికా ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది అనే మాట వినపడుతోంది.
Also read : ఏఐఎస్ అంటే ఏంటీ..? హార్మోజ్ లో భారత నౌక ఆ సిస్టంను ఎందుకు ఆపేసింది..?
అమెరికా యుద్ధనౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ పై ఇరాన్ దాడి చేసిందనే వార్తల విషయంలో.. అమెరికా బలగాల్లోనే విరుద్ధ ప్రకటనలు కనపడుతున్నాయి. ఇరాన్ దళాలు నౌకపై దాడి జరిగినట్లు ప్రకటించగా, అమెరికా రక్షణ శాఖ ఆ వాదనలను తోసిపుచ్చింది. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన విమాన వాహక నౌకగా అబ్రహం లింకన్ ను చెప్తారు. ఇరాన్ యొక్క ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటన ప్రకారం, తమ దళాలు ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4’ లో భాగంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా యుద్ధనౌకపై నాలుగు బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడి చేశాయని, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లు పేర్కొన్నారు.
Also read : బీఆర్ఎస్‌లో సీనియర్ల సైలెన్స్.. ఏమైంది..?
ఈ దాడిలో యుద్ధనౌక తీవ్రంగా దెబ్బతిందని, అది పనిచేయలేని స్థితికి చేరుకుందని ఇరాన్ స్టేట్ టీవీ వెల్లడించింది. దీనిపై ఇప్పుడు అమెరికా సెంట్రల్ కమాండ్ తీవ్రంగా రియాక్ట్ అయింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు యుద్ధనౌక దరిదాపుల్లోకి కూడా రాలేదని, ఆ నౌక సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది. అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) కూడా ఈ సమాచారాన్ని ధృవీకరిస్తూ, అబ్రహం లింకన్ ప్రస్తుతం అరేబియా సముద్రంలో సాధారణ కార్యకలాపాలు సాగిస్తోందని తెలిపింది. అయితే కొందరు సైనికులు మాత్రం ఇరాన్ దాడి చేసిందని నమ్మడం గమనార్హం. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో యుద్ధనౌక తగలబడిపోతున్నట్లు, మునిగిపోతున్నట్లు ఉన్న కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, వీటిని నిపుణులు పరిశీలించగా అవన్నీ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా సృష్టించిన నకిలీ వీడియోలని తేలింది.

