Wednesday, August 5, 2026 12:57 PM
Wednesday, August 5, 2026 12:57 PM

మధ్య ప్రాచ్యంలో మరో యుద్ధం తప్పదా..?

మధ్య ప్రాచ్యంలో యుద్ద మేఘాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన ప్రపంచాన్ని కలవర పెడుతోంది. గత కొన్నాళ్ళుగా ఇరాన్ మీద కత్తులు దూస్తున్న అమెరికా.. తన మిత్ర దేశం ఇజ్రాయిల్ ద్వారా ఇరాన్ మీద దాడులు చేయిస్తుంది అనే వాదనలు వినపడుతున్నాయి. ఇరాన్ తో అమెరికా చేసుకోవాలనుకున్న అణు ఒప్పందం విఫలం కావడం, ఇరాన్ కూడా అమెరికా విషయంలో కఠిన వైఖరితో ముందుకు వెళ్ళడంతో ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది.

Also Read : ఇరాన్ కు వణుకుతున్న ట్రంప్.. సైనికులు వెనక్కే

ఇక ఇజ్రాయిల్.. శుక్రవారం ఇరాన్ పై దాడులకు దిగింది. శుక్రవారం ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీనితో దీర్ఘకాల ప్రాంతీయ ప్రత్యర్థుల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందనే భయాలు మొదలయ్యాయి. ఈ దాడిలో ఇరాన్ ఆర్మీ చీఫ్ మొహమ్మద్ బాఘేరి మరియు రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్-ఇన్-చీఫ్ హుస్సేన్ సలామి మరణించారని ఇజ్రాయిల్ వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతుండటంతో, ఇరాన్ కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చింది. ఇజ్రాయిల్ పై డ్రోన్ దాడులకు దిగింది.

Also Read : మీరు ఆపేస్తే.. మేము కూడా రెడీ.. సై అంటే సై..!

1980ల ఇరాన్-ఇరాక్ యుద్ధం తర్వాత ఇరాన్‌పై జరిగిన అత్యంత ముఖ్యమైన దాడిగా ఈ దాడిని చెప్తోంది అంతర్జాతీయ మీడియా. ఈ దాడిని ” ఆపరేషన్ రైజింగ్ లయన్ ” అని పేర్కొన్న, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, దీనిని దేశ చరిత్రలో ఒక నిర్ణయాత్మక క్షణంగా అభివర్ణించారు. ఈ దాడుల తరువాత ఇరాన్ వైపు నుంచి ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలోని, టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయాన్ని మూసివేసారు. తదుపరి నోటీసు వచ్చేవరకు ఇరాన్ కూడా తన గగనతలాన్ని మూసివేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్