Friday, February 27, 2026 04:56 AM
Friday, February 27, 2026 04:56 AM

బ్రేకింగ్: పరారీలో సునీల్ నాయక్..!

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో.. అప్పుడు నరసాపురం ఎంపీగా ఉన్న ప్రస్తుత ఏపీ డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణంరాజు విషయంలో, పోలీసులు చేసిన కొన్ని చేష్టలపై ఇప్పుడు దర్యాప్తు అధికారులు సీరియస్ గా అడుగులు వేస్తున్నారు. కేసు నీరుగారిపోయింది అనుకున్న సమయంలో ఒక్కొక్కరిని అరెస్ట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 2021లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో, రఘురామ రాజుని రాజేంద్రోహం కేసులో అదుపులోకి తీసుకుని సిఐడిలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలు ఉన్నాయి.

Also Read : కూరగాయలు ఉప్పు నీళ్ళతో కడగడం మంచిదా..?

దీనికి సంబంధించి రఘురామ కృష్ణంరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, సునీల్ నాయక్ కీలకంగా వ్యవహరించారని.. అదేవిధంగా మరికొంతమంది పోలీసులు కూడా తనను చిత్రహింసలకు గురి చేశారని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. వీరిపై గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదయింది.

Also Read : భయపెడుతోన్న బందరు బాదంపాలు..!

అయితే తాజాగా రఘురామ కృష్ణంరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో.. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేశారు. దీనితో సునీల్ నాయక్ పరారీలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోగా బీహార్ కోర్ట్ ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వలేదు. ఇక హైకోర్ట్ లో బెయిల్ పిటీషన్ కూడా సునీల్ నాయక్ దాఖలు చేసారు. ప్రస్తుతం బీహార్ లో ఐజిగా పనిచేస్తున్న సునీల్ నాయక్.. ఏపీ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉండగా కనపడకుండా పోయారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నా భర్తను పరిచయం...

విజయ్‌ దేవరకొండ, రష్మిక మూడు ముళ్ల...

పెద్దల సభ కు...

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ...

టార్గెట్ జనసేనాని అంటున్న...

ఏపీలో రెండు వరుస ఘటనలు ప్రభుత్వాన్ని...

తప్పు ఒకరిది.. కోర్టు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు...

మావో బాస్ కు...

మావోయిస్ట్ ల విషయంలో తెలంగాణా ప్రభుత్వం...

మళ్లీ వస్తే.. వాళ్లకు...

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.....

పోల్స్