ఐసీసీ ట్రోఫీల్లో భారత్ తన ట్రాక్ రికార్డును నిలబెట్టుకుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరిగిన దాయాది పోరులో ప్రత్యర్థి పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ ఆరంభమైన మొదటి ఓవర్‌లో తప్ప.. పాకిస్తాన్ అభిమానుల ముఖంలో మరెక్కడా ఆనందం అనే మాట లేదు. మధ్యలో ఒకటి రెండు సార్లు తప్ప.. ప్రేమదాస స్టేడియంలో పాకిస్తాన్ అభిమానుల అరుపులు, కేకలు ఒక్కసారి కూడా వినిపించలేదు.
Also Read : గేట్స్ రాకతో ఏపీకి గ్లోబల్ అటెన్షన్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు సారధి సల్మాన్ ఆఘా నిర్ణయం ఎంత తప్పు అనేది రెండో ఓవర్ నుంచే నిజమైంది. టార్గెట్ అభిషేక్ శర్మ అన్నట్లుగా వ్యూహాలు రచించిన పాకిస్తాన్ జట్టు.. ఆ విషయంలో సక్సెస్ సాధించినప్పటికీ.. అతనికంటే డేంజరస్ ప్లేయర్స్ ఉన్నారనే విషయాన్ని మర్చిపోయారు. తొలి ఓవర్ చివరి బంతికి అభిషేక్ శర్మను కెప్టెన్ ఆఘా అవుట్ చేశాడు. ఆ తర్వాత నుంచి ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. రెండో ఓవర్ తొలి బంతినే సిక్సర్ బాదిన ఇషాన్.. ఏ దశలోనే పాకిస్తాన్ బౌలర్లపై కనికరం చూపించలేదు. తిలక్ వర్మతో కలిసి రెండో వికెట్‌కు 87 పరుగుల విలువైన భాగస్వామ్యం ఏర్పాటు చేశారు. 40 బాల్స్‌లో 3 సిక్సర్లు, 10 ఫోర్లతో 77 రన్స్ చేసి అవుటయ్యాడు. ఒకదశలో ఇషాన్ సెంచరీ ఖాయమనుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వారిలో హార్దిక్ పాండ్యా మినహా సూర్యకుమార్ యాదవ్, దూబే, రింకూ సింగ్ బౌండరీలో స్కోర్ బోర్డు పరుగులెత్తించారు. భారత్ తన ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది. ఐసీసీ టోర్నీలో భారత్ – పాకిస్తాన్ మధ్య ఇదే అత్యధిక స్కోరు.
Also Read : లారెన్స్ గ్యాంగ్ హిట్ లిస్టులో మరో స్టార్ హీరో..!
176 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఏ దశలోనూ టార్గెట్ దిశగా వెళ్లినట్లు లేదు. తొలి ఓవర్‌లోనే పాకిస్తాన్ ఓపెనర్ ఫార్హన్‌ను పాండ్యా అవుట్ చేశాడు. ఆ తర్వాత రెండో ఓవర్ ఫస్ట్ బాల్‌కు సిక్సర్ కొట్టిన అయుబ్.. రెండో బాల్‌కే బూమ్రా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత అదే ఓవర్ చివరి బాల్‌కు కెప్టెన్ ఆఘాను బూమ్రా అవుట్ చేశాడు. అప్పటికి పాకిస్తాన్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 13 రన్స్ మాత్రమే. దీంతో పాకిస్తాన్ స్కోర్ బోర్డు నత్తతో పోటీపడింది. బాబర్ ఆజామ్‌ను అక్సర్ పటేల్ అవుట్ చేయడంతో.. పాకిస్తాన్ ఓటమి ఖాయమైంది. కాస్త దూకుడుగా ఆడిన ఉస్మాన్ ఖాన్ 44 రన్స్ చేసి పటేల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఇక తొలిసారి బౌలింగ్ చేసిన తిలక్ వర్మ తన తొలి బంతికే షాదబ్ ఖాన్‌ను అవుట్ చేయడంతో.. 78 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. తిలక్ వర్మ రెండు క్యాచ్‌లు డ్రాప్ చేయడంతో.. పాకిస్తాన్ ఓటమి కాస్త ఆలస్యమైంది. 18 ఓవర్ చివరి బంతికి ఉస్మాన్ తారిఖ్‌ను పాండ్యా బౌల్డ్ చేయడంతో.. పాకిస్తాన్ ఓటమి పరిసమాప్తి అయ్యింది.
Also Read : నాతో నాకే పోటీ అంటున్న శ్రీ విష్ణు
ఐసీసీ టీ 20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ తన చివరి 27 మ్యాచ్‌లో కేవలం ఒకటి మాత్రమే ఓడిపోయింది. 26 విజయాలతో 95 శాతం సక్సెస్ రేటుతో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక పాకిస్తాన్‌పై ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. 7 గెలిచి.. దాయాది జట్టుపై పూర్తిస్థాయి ఆధిపత్యం కొనసాగిస్తుంది. కప్పు ముఖ్యం బిగిలూ.. అని విజిల్ సినిమాలో విజయ్ చెప్పిన డైలాగ్‌ను తమ జట్టుకు పాకిస్తాన్ ప్రధాని చెప్పి పంపారు. భారత్‌పై గెలుపు ముఖ్యమన్నారు. అయితే పాకిస్తాన్ ఆఘా టీమ్ మాత్రం.. ఆ దేశ ప్రధాని ఆశలను సింధూ నదిలో కలిపేసింది. పాకిస్తాన్ జట్టు ఆటతీరుపై ఆ దేశ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. దాయాదీ జట్టుపై గెలుపు తర్వాత భారత్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి. అభిమానులు పటాసులు కాల్చారు. ఇషాన్ కిషన్ శివతాండవం.. భారత్‌కు శివరాత్రి, పాకిస్తాన్‌కు కాళరాత్రి అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోయింది.

