Wednesday, August 5, 2026 03:06 AM
Wednesday, August 5, 2026 03:06 AM

ఆ దేశంలో ఉంటే వచ్చేయండి… భారతీయులకు సర్కార్ వార్నింగ్

సిరియా అంతరుద్ద్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న తిరుగుబాటు దళాలు ఇప్పుడు దేశ రాజధానిపై గురి పెట్టాయి. జిహాదీ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ (HTS) నేతృత్వంలోని తిరుగుబాటుదారులు సిరియాలో అతిపెద్ద అనగరమైన్న అలెప్పోతో సహా పలు కీలక నగరాలను స్వాధీనం చేసుకుని క్రమంగా దేశాన్ని ఆక్రమించుకుంటున్నారు. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ సిరియా అంతర్యుద్ధంలో ఈ స్థాయిలో జీహాది గ్రూపులు ముందుకు కదలలేదు. దాదాపుగా అక్కడి సైన్యం కూడా చేతులు ఎత్తేసింది.

Also Read : కాంగ్రెస్‌ ఏడాది పాలన.. ఓల్డ్‌ సిటీకి గుడ్‌ న్యూస్‌..!

చివరికి అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ నివాస నగరం అయిన డమాస్కస్ వైపు వెళ్లాలని జిహాదీలు లక్ష్యంగా పెట్టుకున్నారు. గురువారం, తిరుగుబాటు దళాలు సిరియన్ భూభాగంలోకి లోతుగా చొచ్చుకు వచ్చాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దేశంలోని నాల్గవ అతిపెద్ద నగరమైన హమాలోని సెంట్రల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి తిరుగుబాటు దళాలు. హమాలో విజయం తిరుగుబాటుదారులకు ఒక వ్యూహాత్మక మైలురాయిగా చెప్పుకొచ్చింది అంతర్జాతీయ మీడియా. ఇప్పుడు కీలక నగరమైన హోమ్స్‌ పై దృష్టి సారించారు.

Also Read : ఆయన సీఎం పదవి ఐదేళ్లూ సేఫేనా…?

దీనితో ఆ దేశంలో ఉండే పౌరుల విషయంలో భారత్ అలెర్ట్ అయింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సిరియాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, తదుపరి ప్రకటన వచ్చే వరకు భారతీయ పౌరులు సిరియాకు అన్ని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. అక్కడ ఉన్న వారు అందుబాటులో ఉన్న విమానాలలో త్వరగా భారత్ చేరుకోవాలని హెచ్చరించింది. రాలేని వారు తమ భద్రత గురించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ సిరియాలో దాదాపు 90 మంది భారతీయులు ఉన్నారని, వీరితో సహా 14 మంది వివిధ ఐఖ్యరాజ్య సమితి సంస్థల్లో పనిచేస్తున్నారని తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్