Thursday, February 26, 2026 09:32 PM
Thursday, February 26, 2026 09:32 PM

మేడం గారు రెబల్.. అర్ధరాత్రి స్కూటిపై.. గంజాయి బ్యాచ్ కు చుక్కలు..!

సాధారణంగా మహిళలు అనగానే రాత్రి సమయాల్లో బయటకు వెళ్లేందుకు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రమాదకరమైన ప్రదేశాల్లో తిరగడానికి భయమూ ఉంటుంది. కానీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాత్రం బుధవారం సాయంత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారు. అర్ధ రాత్రి స్కూటీపై గంజాయి బ్యాచ్ ఉన్న ప్రాంతానికి వెళ్ళారు. అసలు మేటర్ ఏంటో ఒకసారి చూస్తే, గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో ఓ నిర్మానుష్య ప్రదేశంలో కొంతమంది యువకులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు.

Also Read : సీఎంఓలో ఆ ఇద్దరు అవుట్..?

వారి కారణంగా ఇబ్బంది పడుతోన్న స్థానిక ప్రజలు.. గత కొన్ని రోజులుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయినా మార్పు లేదు. చివరకు ఓ మహిళ ఎమ్మెల్యే మాధవికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసారు. ఫోన్ వచ్చిన వెంటనే తన స్కూటీపై స్వయంగా ఒక్కరే అక్కడికి వెళ్ళారు. స్వయంగా ఎమ్మెల్యే అక్కడికి రావడం గమనించిన యువకులు అక్కడి నుంచి పారిపోయారు. అక్కడ ఉన్న స్థానిక మహిళలతో ఎమ్మెల్యే మాధవి మాట్లాడారు. పోలీసులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Also Read : బ్రేకింగ్: పరారీలో సునీల్ నాయక్..!

ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఇక స్వయంగా ఎమ్మెల్యే అక్కడికి రావడంతో మహిళలు షాక్ అయ్యారు. ఒక్క ఫోన్ కాల్ తో ఎమ్మెల్యే రావడం ఒక ఎత్తు అయితే, రాత్రి సమయంలో స్కూటీపై ఆమె రావడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని అక్కడ కామెంట్స్ వస్తున్నాయి. మేడం రెబల్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల సిఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తర్వాత, ఆయన నివాసంపై కూడా దూకుడుగానే వెళ్ళారు ఎమ్మెల్యే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నా భర్తను పరిచయం...

విజయ్‌ దేవరకొండ, రష్మిక మూడు ముళ్ల...

పెద్దల సభ కు...

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ...

టార్గెట్ జనసేనాని అంటున్న...

ఏపీలో రెండు వరుస ఘటనలు ప్రభుత్వాన్ని...

తప్పు ఒకరిది.. కోర్టు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు...

మావో బాస్ కు...

మావోయిస్ట్ ల విషయంలో తెలంగాణా ప్రభుత్వం...

మళ్లీ వస్తే.. వాళ్లకు...

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.....

పోల్స్