Saturday, September 19, 2026 10:15 AM
Saturday, September 19, 2026 10:15 AM

షమీకి ఫోన్ చేయలేరా..? సెలెక్టర్ లపై మాజీ క్రికెటర్ ఫైర్..!

గత కొన్ని రోజులుగా భారత సెలెక్షన్ కమిటీ విషయంలో తీవ్ర విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. టెస్ట్ జట్టు ఎంపికలో హెడ్ కోచ్ గంభీర్ జోక్యంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. బౌలింగ్ యూనిట్ లో ఒక అంచనా లేకుండా అతను వ్యవహరిస్తున్నాడని కనీసం ఒక ముందస్తు ప్రణాళిక లేదని ఫ్యాన్స్, మాజీ క్రికెటర్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. రాజకీయాలు జరుగుతున్నాయనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. ముఖ్యంగా పేస్ బౌలర్ మహ్మద్ షమీని జట్టు నుంచి తప్పించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Also Read : గ్రాండ్‌గా అఖండ 2 ప్రీ రిలీజ్.. చీఫ్ గెస్ట్‌ ఎవరంటే..?

తాజాగా దీనిపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేసాడు. పేసర్ మహమ్మద్ షమీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్టర్లు వ్యవహరించిన తీరుపై మండిపడ్డాడు. రంజీ ట్రోఫీలో బాగా రాణించినప్పటికీ గత కొన్ని సిరీస్‌ లలో షమీని విస్మరిండంపై అసహనం వ్యక్తం చేసారు. సెలెక్టర్ లకు అతని విషయంలో కమ్యూనికేషన్ లోపం ఉందా అని నిలదీశాడు. సెలెక్టర్లు పారదర్శకతను పాటించలేదని, సీనియర్ బౌలర్ విషయంలో నమ్మకం లేనట్లు కనపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసాడు.

Also Read : అక్కడ హిడ్మాపై అభిమానం చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!

ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో షమీ బెంగాల్ తరఫున ఆకట్టుకున్నాడు. కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులకు దూరంగా ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌ కు జట్టు ప్రకటన తర్వాత, షమీ ఫిట్‌నెస్‌ పై తనకు స్పష్టమైన అప్‌ డేట్ లేదని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటన చేయడంపై తివారి అసహనం వ్యక్తం చేసాడు. ఫిట్‌నెస్ అప్‌డేట్ లేదని సెలెక్టర్లు చెప్పారు. కానీ అది ఎవరి పని? అని నిలదీశాడు. కోచ్ లు, ఫిజియోలు అప్డేట్ లు ఇవ్వాలన్నాడు. అతనితో కనీసం ఫోన్ చేసి మాట్లాడి.. తెలుసుకోవచ్చు అన్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

పోల్స్