Wednesday, May 6, 2026 08:04 PM
Wednesday, May 6, 2026 08:04 PM

రెండు తప్పులు సీరీస్ ను ముంచాయా..?

టెస్ట్ క్రికెట్ లో ఓపికగా పరుగులు చేయాలి. ఒక్క పరుగు కోసం కక్కుర్తి పడటం, దూకుడుగా ఆడేసి పరుగులు చేయాలి అనుకోవడం పిచ్చి తనం. డిఫెన్స్ ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ అప్పుడప్పుడు షాట్ లు ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడపాలి. ఈ విషయంలో భారత ఆటగాళ్ళు ఫెయిల్ అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అద్భుతమైన ప్రతిభ ఉన్నా సరే చిన్న చిన్న తప్పులు మ్యాచ్ ఫలితాలను మార్చేస్తున్నాయి. ఈ సీరీస్ లో ఇంగ్లాండ్ కంటే భారత్ చాలా బాగా ఆడింది.

Also Read : ఐపీఎస్ సంజయ్‌కి సుప్రీంకోర్టులో భారీ షాక్

కాని చిన్న తప్పులతో సీరీస్ ప్రమాదంలో పడింది. మూడవ టెస్ట్ లో పంత్.. రన్ అవుట్ కావడం కొంప ముంచింది. లేదంటే పంత్ మరో 40 లేదా 50 పరుగులు చేసేవాడు. ఆ ప్రభావం తర్వాత రాహుల్ పై కూడా పడింది. అప్పటి వరకు జట్టును పటిష్ట స్థితిలో ఉంచిన ఈ ఇద్దరూ వెంటనే అవుట్ అయ్యారు. రాహుల్ సెంచరీ కోసం పంత్ కంగారు పడ్డాడు. ఇక 5వ టెస్ట్ లో కూడా అదే జరిగింది. గిల్ అనవసర పరుగు కోసం ప్రయత్నం చేసి వికెట్ పోగొట్టుకున్నాడు. మంచి ఫాంలో ఉన్న గిల్ వికెట్ పారేసుకోవడం జట్టుపై ప్రభావం చూపింది.

Also Read : మరో పొలిటికల్ డ్రామా.. తెర పైకి కొత్త ఉద్యమం..!

ఆ తర్వాత వచ్చిన జడేజా, జురెల్ పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. పిచ్ పై పచ్చిక ఉన్నా సరే గిల్ చాలా స్వేచ్చగా, దూకుడుగా ఆడాడు. కాని వికెట్ చేజార్చుకోవడంతో స్కోర్ నెమ్మదించింది. ఈ రన్ అవుట్ ఫలితం ఎలా ఉంటుందో రాబోయే రెండు రోజుల్లో తేలిపోనుంది. ఇక అనవసర షాట్ కోసం ప్రయత్నం చేసి జురెల్ కూడా అవుట్ అయ్యాడు. ఇప్పటికే రెండు విజయాలతో సీరీస్ లో లీడింగ్ లో ఉన్న ఇంగ్లాండ్.. ఈ మ్యాచ్ డ్రా చేసుకున్నా, లేదంటే గెలిచినా సీరీస్ కైవసం చేసుకుంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్