బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లు ఇప్పుడు బాలీవుడ్ దాటి సౌత్ ఇండియా పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇండియన్ సినిమాను డామినేట్ చేస్తున్న తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించేందుకు హీరోయిన్ లు ఆసక్తి చూపిస్తున్నారు. దీపిక పదుకొనే, శ్రద్దా కపూర్, దిశా పటాని వంటి స్టార్ హీరోయిన్ లు ఇప్పటికే తెలుగు సినిమాల్లో కనిపించారు. ఇక మృణాల్ ఠాకూర్ అన్ని భాషలను కవర్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. జాన్వీ కపూర్ కూడా దేవర సినిమా తర్వాత రామ్ చరణ్.. పెద్ది సినిమాలో నటిస్తోంది.
Also Read : ఏపిలో గూగుల్ డేటా సెంటర్ ముహుర్తం ఫిక్స్..!
అయితే వీరిలో దీపిక పదుకొనే మాత్రమే కాస్త హాట్ టాపిక్ అవుతోంది. కల్కీ సినిమాతో టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దీపిక.. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం కాస్త ఇబ్బంది పెడుతోంది అనే ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమాలో దీపిక నటించడానికి సిద్దమైనా సరే రెమ్యునరేషన్ దెబ్బకు ఆమెను సందీప్ రెడ్డి వంగా పక్కన పెట్టారు. ఈ వ్యవహారం కాస్త వివాదాస్పదంగా కూడా మారింది. సందీప్ రెడ్డి వంగా పరోక్షంగా ఆమెపై విమర్శలు కూడా చేసారు.
Also Read : జూబ్లిహిల్స్ పై కవిత గురి..? పక్కా వ్యూహంతో బరిలోకి..!
ఇక ఇప్పుడు కల్కీ పార్ట్ లో ఆమె నటించడం లేదనే వార్త హాట్ టాపిక్ అయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. కొన్ని కారణాలతో ఆమె తప్పుకుంటున్నారు అని, ఆమె భవిష్యత్తు బాగుండాలి అంటూ పేర్కొంది. దీని వెనుక కారణం ఏంటీ అనేది స్పష్టత ఇవ్వకపోయినా.. రెమ్యునరేషన్ ప్రధాన కారణంగా భావిస్తున్నాయి సినీ వర్గాలు. ఆమె భారీగా డిమాండ్ చేయడమే కాకుండా హిందీ లాభాల్లో వాటా అడిగారు అంటూ ప్రచారం ఉంది. అందుకే పక్కన పెట్టినట్టు టాక్ వినపడుతోంది.