Sunday, June 21, 2026 06:18 AM
Sunday, June 21, 2026 06:18 AM

ఏపిలో గూగుల్ డేటా సెంటర్ ముహుర్తం ఫిక్స్..!

విశాఖను ఐటీ హబ్‌గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో సీఐఐ – గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక వేత్తలకు ఏపీ ప్రభుత్వం అందుబాటులో ఉంటుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఎవరూ పోటీ పడలేరన్నారు. పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఏపీలో అందుబాటులో ఉన్నాయని

Also Read : కేరళలో మరో వైరస్ అలజడి.. లక్షణాలు ఇవే

వచ్చే నెలలోనే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ జనవరి నెలలో అమరావతిలో ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఔత్సాహిత పారిశ్రామికవేత్తలను, ఆలోచనలను ప్రోత్సహిస్తామన్నారు. 2028 నాటికే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందన్నారు. ఏపీలో లాజిస్టిక్స్ రంగంపై దృష్టి పెట్టామని పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు, రైల్వేలను సమన్వయం చేస్తూ రవాణా వ్యయాన్ని తగ్గిస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

Also Read : ఓజీ.. రెడీ ఫర్ స్క్రీనింగ్..!

వచ్చే ఏడాది ఆగస్టు నుంచి భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తుందన్నారు సీఎం. విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడపతో పాటు ఓర్వకల్లు, పుట్టపర్తి లాంటి చోట్ల విమానాశ్రయాలు రాష్ట్రాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తున్నాయని స్పష్టం చేశారు. త్వరలో అమరావతిలోనూ అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు. హైదరాబాద్-అమరావతి-చెన్నైలను అనుసంధానిస్తూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా వస్తుందన్నారు. వాట్సప్ గవర్నెన్సు ద్వారా పౌర సేవలను అందిస్తున్నామని వివరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్