Wednesday, May 6, 2026 07:31 PM
Wednesday, May 6, 2026 07:31 PM

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. ఆ నలుగురి అరెస్ట్ పక్కా..?

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ కేసులో అరెస్ట్ లు ఒక సంచలనం అయితే ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అడుగు పెట్టడం మరో సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున డబ్బును విదేశాలకు తరలించారు అనే ఆరోపణల నేపధ్యంలో ఈ కేసులో ఈడీ విచారణ మొదలుపెట్టింది. మనీ లాండరింగ్ తో పాటుగా పలు అంశాల్లో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ హైదరాబాద్ లో సోదాలు మొదలుపెట్టింది. హైదరాబాద్‌లోని 8 ప్రాంతాల్లో ఈడీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు.

Also Read : టీటీడీ కీలక నిర్ణయం.. అన్ని సేవలకు లక్కీ డిప్‌..!

ఏపీలో రెండు ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న ఈడీ.. ఏపీ, తెలంగాణాతో పాటుగా తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో కూడా పలువురి నివాసాలలో ఏక కాలంలో సోదాలు జరిపింది. రూ.3,500 కోట్ల స్కాంకు పాల్పడట్లు గుర్తించిన అధికారులు.. ఆ నిధులను ఎక్కడ ఉంచారు అనే దానిపై ఆరా తీస్తోంది. నకిలీ ఇన్వాయిస్‌లు, పెంచిన మద్యం ధరల వెనుక భారీ స్కాం జరిగినట్టు తేల్చారు. లిక్కర్‌ స్కాంలో ఉన్న కొంతమంది నిందితుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

Also Read : అమెరికాకు దగ్గరయ్యేందుకు పాక్ కష్టాలు..!

ఇక ఈ కేసులో ఈడీ ఖచ్చితంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ కేసులో మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. నిందితుల డిఫాల్ట్‌ బెయిల్స్‌పై ఏసీబీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సిట్ సవాల్ చేసింది. ఈ అంశంపై 4 పిటిషన్లు విచారణ దశలో ఉండటంతో ఏసీబీ కోర్టులో డిఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. ఇప్పటికే డిఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్లను రాజ్‌కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి విత్ డ్రా చేసుకున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్