Sunday, June 21, 2026 09:03 AM
Sunday, June 21, 2026 09:03 AM

ఈరోజు (20-10-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయణం, శరదృతువు, శుక్లపక్షం 20-10-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 20-10-2025

భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

—————————————

వృషభం 20-10-2025

ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. సంతాన విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

—————————————

మిధునం 20-10-2025

దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. నూతన రుణయత్నాలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

—————————————

కర్కాటకం 20-10-2025

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు.

—————————————

సింహం 20-10-2025

నూతన వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి.

—————————————

కన్య 20-10-2025

నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలలో వాయిదా పడుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి.

—————————————

తుల 20-10-2025

స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు పాటిస్తారు.

—————————————

వృశ్చికం 20-10-2025

కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నవి.

—————————————

ధనస్సు 20-10-2025

ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పనులు చకచకా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. మీ నిర్ణయాలు అందరికి నచ్చే విధంగా ఉంటాయి. వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తాయి.

—————————————

మకరం 20-10-2025

వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్త్ర వస్తులాభాలు పొందుతారు.

—————————————

కుంభం 20-10-2025

దూర ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితులతో విభేదాలు చికాకు పరుస్తాయి. కుటుంబంలో కొందరి మాటలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. పాత ఋణలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు.

—————————————

మీనం 20-10-2025

కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరంగా సమస్యలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం దైవ చింతన కలుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్