Friday, May 15, 2026 08:42 PM
Friday, May 15, 2026 08:42 PM

ఈరోజు (09-10-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయణం, శరదృతువు, శుక్లపక్షం 09-10-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 09-10-2025

చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

—————————————

వృషభం 09-10-2025

ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు.

—————————————

మిధునం 09-10-2025

సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రయత్నలలో అవరోధాలు తొలగుతాయి.

—————————————

కర్కాటకం 09-10-2025

సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

—————————————

సింహం 09-10-2025

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

—————————————

కన్య 09-10-2025

దూరపు బంధువుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నూతన ఋణ యత్నాలు కొంత కష్టంతో పూర్తిఅవుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపార వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి.

—————————————

తుల 09-10-2025

కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

—————————————

వృశ్చికం 09-10-2025

సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమౌతాయి. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

—————————————

ధనస్సు 09-10-2025

సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు ఊహించని సమస్యలు కలుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

—————————————

మకరం 09-10-2025

ముఖ్యమైన వ్యవహారాలలో కొంత జాప్యం కలుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

—————————————

కుంభం 09-10-2025

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. బంధు మిత్రుల సహాయం సహకారాలు అందుతాయి. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి అధికారుల సహాయంతో బయటపడతారు.

—————————————

మీనం 09-10-2025

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణ సంభంధిత సమస్యలు వలన ఒత్తిడి తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో మాట నిలబెట్టుకున్న...

ఏపీలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రమాణాలను...

మహానాడుపై టీడీపీ సంచలన...

తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా అత్యంత...

బండి భగీరథ్‌ కు...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

పొదుపు బాటలో ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పొదుపు...

నా కోసం ట్రాఫిక్...

సాధారణంగా రాజకీయ నాయకులు వెళ్తున్న సమయంలో...

దస్తగిరి హ*త్య కేసులో...

కడపలో సంచలనంగా మారిన రియల్ ఎస్టేట్...

పోల్స్