Wednesday, May 6, 2026 08:57 PM
Wednesday, May 6, 2026 08:57 PM

ఈరోజు (07-01-2026) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, బహుళ పక్షం 07-01-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి…

మేషం 07-01-2026

వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు.

—————————————

వృషభం 07-01-2026

శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

—————————————

మిధునం 07-01-2026

వృత్తి వ్యాపారాలు చికాకుగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుగుతాయి. బంధువులతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి.

—————————————

కర్కాటకం 07-01-2026

ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఏర్పడతాయి.

—————————————

సింహం 07-01-2026

వ్యాపారాలు సంతృప్తి కలిగిస్తాయి. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తొలగుతుంది. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

కన్య 07-01-2026

నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

—————————————

తుల 07-01-2026

ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం లభిస్తుంది. కొన్ని పనులలో ఆప్తులు సలహాలు తీసుకోవడం మంచిది.

—————————————

వృశ్చికం 07-01-2026

సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తుల పనికి తగిన గుర్తింపు లభించక విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాక చికాకులు పెరుగుతాయి.

—————————————

ధనస్సు 07-01-2026

బంధు మిత్రుల ఆదరణ కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అనుకుంటారు. ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగి స్థిరత్వం కలుగుతుంది. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు.

—————————————

మకరం 07-01-2026

ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఊహించని విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

—————————————

కుంభం 07-01-2026

చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక శ్రమాధిక్యత కలుగుతుంది. బంధువులు మీ మాటతో విభేదిస్తారు ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో భాగస్తులు తో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి.

—————————————

మీనం 07-01-2026

నూతన వ్యాపారాలు ఒడిదుడుకులుగా ఉంటాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్