Saturday, June 20, 2026 07:24 PM
Saturday, June 20, 2026 07:24 PM

ఈరోజు (27-08-2025) రాశి ఫలితాలు

 

మేషం 27-08-2025

ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమునశుభకార్యాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

—————————————

వృషభం 27-08-2025

దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

—————————————

మిధునం 27-08-2025

ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

—————————————

కర్కాటకం 27-08-2025

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

—————————————

సింహం 27-08-2025

ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాబాలు అందుకుంటారు. చిన్న నాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

—————————————

కన్య 27-08-2025

వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

—————————————

తుల 27-08-2025

చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. సోదరులతో స్థిరాస్థి వివాదాలు కలుగుతాయి. బంధుమిత్రుల మాటలు మానసిక చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబదుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఉద్యోగస్తులు కష్టానికి తగిన ఫలితం లభించదు.

—————————————

వృశ్చికం 27-08-2025

ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సహాయం అందుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

—————————————

ధనస్సు 27-08-2025

రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. వ్యాపార ఉద్యోగాలు ఊహించని స్థాన చలనాల కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

—————————————

మకరం 27-08-2025

చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం నుండి ఉపశమనం పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

—————————————

కుంభం 27-08-2025

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అవసరానికి చేతిలో తగినంత డబ్బు నిల్వ ఉండదు. కొన్ని పనులలో తొందరపాటు నిర్ణయాలు చేసిన నష్టపడతారు. వృత్తి వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ విషయమై అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

—————————————

మీనం 27-08-2025

సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు. అవసరానికి ధన సహాయం అందుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్