Sunday, March 1, 2026 03:59 AM
Sunday, March 1, 2026 03:59 AM

మిత్రపక్షమే కానీ.. బీజేపీ తీరుపై విమర్శలు..!

తిరుమల లడ్డూ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద కుదుపు కుదిపేస్తోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనేది ప్రధాన ఆరోపణ. కోర్టుకు సిట్ సమర్పించిన రిపోర్టులో కూడా నాడు సరఫరా చేసిన నెయ్యిలో వ్యర్థాలు, కెమికల్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించినట్లు సిట్ రిపోర్టులో స్పష్టం చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఏక సభ్య కమీషన్‌ను కూడా నియమించింది. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తిరుమల లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు మద్దతు ఇవ్వడంలో బీజేపీ చురుకైన పాత్ర పోషించకపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది.

Also Read : కూటమి సర్కార్‌లో వైసీపీ ఐఏఎస్‌ల కుట్ర..!

వాస్తవానికి, బీజేపీ తనను తాను హిందూత్వ ఎజెండాకు మద్దతుదారుగా తొలి నుంచి చూపించుకుంటుంది. అలాగే హిందూ మనోభావాలను అవమానించిన సందర్భాలను తరచుగా రాజకీయ ఉద్యమంగా మారుస్తుంది కూడా. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే.. అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలపై ప్రభావం చూపిస్తుంది. అయోధ్య రామాలయం గురించి ఎంతో పోరాటం చేసిన పార్టీ బీజేపీ. అలాంటి కాషాయ పెద్దలు కల్తీ నెయ్యి విషయంలో మాత్రం సైలెంట్‌గా వ్యవహరించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. నిజానికి కల్తీ నెయ్యి అంశంపై జాతీయ స్థాయిలో రచ్చ చేయవచ్చు. పార్లమెంట్‌లో కూడా ఈ అంశంపై చర్చించవచ్చు. కానీ అవేవీ జరగటం లేదు.

సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ ఇప్పటికి అనేక సార్లు ఢిల్లీ వెళ్లినప్పటికీ, కేంద్ర నాయకత్వం ఈ అంశంలో స్పందించాలని చేసిన విజ్ఞప్తులకు ఎలాంటి స్పందన రాలేదు. వారు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అధికారికంగా, ఈ పర్యటనలు ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సహాయం కోరే ప్రయత్నాలుగా మాత్రమే సాగుతున్నాయి. అయితే లడ్డూ వివాదంలో వైసీపీని లక్ష్యంగా చేసుకోవడంలో బీజేపీ మద్దతును పొందడం మరొక ముఖ్య ఎజెండా అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రతిపాదన వైసీపీని నిర్ణయాత్మక రీతిలో రాజకీయంగా ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. అయితే, బీజేపీ పెద్దలు మాత్రం ఈ విషయంలో మీనమేషాలు లెక్కేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ఆచితూచి వ్యవహరిస్తున్నారు కూడా.

Also Read : ప్రముఖ కంపెనీలో సగం మంది ఉద్యోగులు అవుట్..!

మరో విషయం కూడా బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీని పూర్తిగా బలహీనపరచడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ వృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుందని.. అందుకే బీజేపీ పెద్దలు వైసీపీకి తెర వెనుక మద్దతు ఇస్తున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. రాజకీయ లాభనష్టాలను తూకం వేసిన తర్వాత మాత్రమే బీజేపీ పెద్దలు అడుగులు వేస్తాయనేది అందరికీ తెలిసిన విషయం. అందుకే జాతీయ స్థాయిలో ఈ సమస్య నుండి జాగ్రత్తగా, దూరంగా ఉండాలనే మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వైఖరి ఆంధ్రప్రదేశ్‌లోని కూటమిలో చీలికకు తావిస్తోంది. స్థానిక బీజేపీ నాయకులు అప్పుడప్పుడు వైసీపీని విమర్శిస్తుండగా, కేంద్ర నాయకత్వం మాత్రం వైసీపీ ఎంపీలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నట్లు చెబుతారు. అయితే మిత్రపక్షంగా ఉండటం అంటే ప్రతి రాజకీయ భారాన్ని పంచుకోవడం కాదని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్ : కాకినాడలో...

ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర ప్రమాదం...

కనిమొళికి, కవితకు జరిగిన...

ఆయేషా మీరా హత్య కేసు.. తెలుగు...

ఢిల్లీలో స్వామిని యాక్టివేట్...

ప్రాంతీయ పార్టీలు వారి వారి రాష్ట్రాల్లో...

ఇంత జరుగుతున్నా.. ఆయనెక్కడా..?

ఇంత జరుగుతున్నా.. ఆయనెక్కడా..? ఇప్పుడు ఇదే...

బీఆర్ఎస్, బిజెపిలకు బులెట్...

గత నాలుగేళ్ల నుంచి సంచలనంగా మారిన...

అన్న వాకింగ్ అంటే.....

"మరో ఏడాదిన్నరలో నా పాదయాత్ర మొదలవుతుంది."...

పోల్స్