Wednesday, March 4, 2026 01:18 AM
Wednesday, March 4, 2026 01:18 AM

కల్తీ నెయ్యి కేసు: కమిషన్ రిపోర్ట్‌తో రాజకీయ దుమారం?

తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహం మొదటి అంతస్తును కమిషన్ కార్యాలయంగా కేటాయించి, అక్కడి నుంచే విచారణను ప్రారంభించారు. కమిషన్‌కు 45 రోజుల గడువు విధిస్తూ, ఆ వ్యవధిలో సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. విచారణ ప్రక్రియ సక్రమంగా సాగేందుకు టిటిడీ, విజిలెన్స్, పోలీసు విభాగాల నుంచి అవసరమైన రికార్డులు సమీకరించేందుకు లైజన్ అధికారిని నియమించగా, డ్రైవర్‌తో పాటు ఐదుగురు సిబ్బందిని కూడా కమిషన్‌కు కేటాయించారు.

Also Read : ఆఫ్ ది రికార్డ్.. అందుకే విందు రాజకీయం..!

ఈ కమిషన్ ముఖ్యంగా 2021 నుంచి 2024 వరకు జరిగిన టెండర్ ప్రక్రియ, నాణ్యత ప్రమాణాల అమలు, సరఫరా వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులు, పరిపాలనా నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను విశ్లేషించనుంది. ప్రత్యేకంగా నెయ్యి సరఫరా, నిల్వ, వినియోగ విధానాల్లో ఏవైనా లోపాలు చోటుచేసుకున్నాయా? నాణ్యత నియంత్రణలో వైఫల్యాలు ఎక్కడ జరిగాయి? అవకతవకలు జరిగి ఉంటే వాటి పరిమాణం ఎంత? బాధ్యులు ఎవరు? వంటి అంశాలపై దృష్టి సారించనుంది. అవసరమైతే సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను, ఇతర బాధ్యులను విచారణకు పిలిచి వాంగ్మూలాలు సేకరించే అవకాశముంది.

ఏకసభ్య కమిషన్ ఏర్పాటుపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, దీనిపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో విచారణకు న్యాయపరమైన అడ్డంకులు తొలగినట్లయ్యాయి. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో కూడా చర్చలు జోరందుకున్నాయి. ముఖ్యంగా గత పాలనలో తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరగనున్నందున, సంబంధిత వర్గాలు అప్రమత్తంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read : వారిని దూరం పెట్టారా..? లేక ఉంటున్నారా..? 

తిరుమల వంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యం గల క్షేత్రంలో ప్రసాద నాణ్యతపై వచ్చిన ఆరోపణలు భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశం. కాబట్టి విచారణ పారదర్శకంగా, సమగ్రంగా, సమయపాలనతో పూర్తి కావడం అత్యంత అవసరం. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని త్వరితగతిన పరిష్కరించి స్పష్టమైన నివేదికను ప్రజల ముందుంచితేనే విశ్వాసాన్ని పునరుద్ధరించగలదు. లేదంటే భవిష్యత్‌లో ఈ అంశం రాజకీయంగానూ, పరిపాలనా పరంగానూ ప్రభావం చూపే అవకాశముంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రైతులకు ఇచ్చిన డ్రోన్లు...

ప్రతి పనిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలనేది...

వారి మెడకే చుట్టుకున్న...

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్...

అటవీశాఖలో సంస్కరణలు: పవన్...

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...

దేవుడి ముందే రచ్చ...

ఏపీలో ప్రతిపక్షమే లేదు. కానీ.. తెలుగుదేశం...

వారిని దూరం పెట్టారా..?...

ఉమ్మడి గుంటూరు జిల్లా నేతల తీరుపై...

ఏఐ డీప్‌ఫేక్ కలకలం...

సాంకేతికతను ఆసరాగా చేసుకుని మహిళల గౌరవానికి...

పోల్స్